తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150 సినిమాలకు పైగా నటించిన స్టార్ లేడీ కమెడియన్ పాకీజా... అలియాస్ వాసుకి. అన్ని సినిమాలు చేసింది కదా.. బాగా సంపాదించి మంచి రాజభవనాల్లో గొప్పగా బ్రతుకుతుంటుంది కదా అని అనుకుంటారు అంతా. కాని చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది నటి పాకీజా. కడుపునిండా తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంది.