స్విట్జర్లాండ్ లో  మహేష్ ని వదిలేసి ఇద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాం: అసలు విషయం బయటపెట్టిన నమ్రత

First Published Apr 21, 2021, 2:37 PM IST

టాలీవుడ్ లో మహేష్ ది మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్. ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా మహేష్ పై ఒక్క వివాదం లేదు. తనపని తాను చూసుకోవడం, అవసరమైనంత వరకే మాట్లాడడం మహేష్ నైజం.

అందుకే మహేష్ ని మిస్టర్ క్లీన్ అంటూ ఉంటారు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్... మిస్ పర్ఫెక్ట్ ని భార్యగా తెచ్చుకున్నాడు. మహేష్ ని ప్రేమ వివాహం చేసుకున్న నమ్రత ఉత్తమ ఇల్లాలు అనడంలో సందేహం లేదు.
undefined
పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పిన నమ్రత, ఇంటికే పరిమితం అయ్యారు. నమ్రత బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆమె ప్రవర్తన అసలు నమ్మబుద్ది కాదు. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన నమ్రత, మహేష్ తో పెళ్లినాటికి కూడా హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. తన కెరీర్, ఫ్యాషన్ పక్కన పెట్టి.. భర్త, కుటుంబమే లోకంగా ఆమె జీవిస్తున్నారు.
undefined
మహేష్, నమ్రతల ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార పుట్టారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక నమ్రత మహేష్ అనధికారిక మేనేజర్ గా మరారు. మహేష్ సినిమాలు, రెమ్యూనిరేషన్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, బిజినెస్ లను నమ్రతానే చూసుకుంటారు.
undefined
మహేష్ స్టార్ గా ఎదగడంలో నమ్రత రోల్ ఎంతో ఉన్నదనేది వాళ్ళ సన్నిహితుల మాట. సినిమాల ఎంపిక విషయంలో కూడా నమ్రత సలహాలు, సూచనలు ఉంటాయట. మహేష్ ని నమ్రత అంతగా ప్రేమిస్తారు కాబట్టే, ఆమెను ఆయన కూడా అంతగా ప్రేమిస్తారు.
undefined
తరచుగా మహేష్ కుటుంబంతో కలిసి వరల్డ్ టూర్ కి వెళుతూ ఉంటారు. ప్రతిసినిమా షూటింగ్ మొదలయ్యే ముందు, పూర్తయ్యాక తప్పకుండా టూర్ కి వెళతారు.
undefined
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నమ్రత పిల్లలతో గడిపిన అరుదైన క్షణాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా కొడుకు గౌతమ్ తో దిగిన ఓ త్రో బ్యాక్ చిత్రాన్ని నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
undefined
ఆ ఫొటో నేపథ్యం తెలియజేస్తూ... గతంలో ఓసారి స్విట్జర్లాండ్ టూర్ కి వెళ్ళినప్పుడు లేకుండా గౌతంతో లాంగ్ డ్రైవ్ కి వెళ్లారట నమ్రత. అదే దేశంలో మహేష్ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఓ పాట చిత్రీకరణలో మహేష్ పాల్గొనాల్సి ఉందట. దానితో మహేష్ వీరితో లాంగ్ డ్రైవ్ కి రాలేకపోయారట.  దానితో గౌతమ్, నేను కారులో లాగ్ డ్రైవ్ కి వెళ్ళాం అని నమ్రత ఆ ఫోటో గురించి తెలిపారు.
undefined
click me!