నేను అప్పుడు మద్యం తాగలేదు... నేను ఆ పని చేయలేదంటున్న మహేష్ హీరోయిన్!

First Published May 16, 2021, 10:49 AM IST

చూడగానే కట్టిపడేసే ముఖం, మంచి హైట్, ఫిజిక్ కలిగిన హీరోయిన్ ధన్యా బాలకృష్ణను చూస్తే తెలుగు అమ్మాయిలానే తలపిస్తుంది. నిజానికి ధన్యా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఫేమ్ తెచ్చుకున్నారు. 
 

స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ కలిగిన ధన్యా , కాలం కలిసి రాక అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. పిచ్చెక్కించే గ్లామర్ ఉండి కూడా ఆమె హీరోయిన్స్ ఫ్రెండ్ పాత్రలకు, చిన్న బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
undefined
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజా రాణీ, రాజుగారి గది, నేను శైలజ చిత్రాలలో ధన్యా ప్రాధాన్యం ఉన్న పత్రాలు చేశారు. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ అంటే క్రష్ ఉన్న అమ్మాయిగా ధన్యా  పాత్ర ఆకట్టుకుంటుంది. కనిపించేది ఒకటి అరా సన్నివేశాలలో అయినా ధన్యా గుర్తుండిపోయారు .
undefined
తెలుగు కన్నడ పరిశ్రమలలో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతున్న ధన్యా తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇంస్టాగ్రామ్ ఛాట్ లో తన అభిరుచులు, కెరీర్ గురించి అనేక విషయాలు తెలియజేశారు.
undefined
రాజు రాణీ మూవీలో మీ పాత్ర గురించి చెప్పండి అని ఓ నెటిజెన్ అడుగగా... ఆ మూవీలో నేను మద్యం తగినట్లు చూపించారు. నిజానికి నేను అప్పుడు తాగింది మంచినీళ్లే. నాకు పార్టీలు అంటే ఇష్టం ఉండదు. కాకపోతే వీకెండ్ ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్స్, డిన్నర్స్ కి వెళ్ళడానికి ఇష్టపడతాను అని చెప్పారు.
undefined
ఇక మహేష్ తో నటించడం గొప్ప ఫీలింగ్ అని ధన్యా తెలియజేశారు. ఆయన మంచి మనసున్న మనిషి అంటూ కొనియాడారు ధన్యా.  పవన్ కళ్యాణ్, సూర్య, రన్బీర్ కపూర్ అంటే తనకు క్రష్ అని ఆమె చెప్పడం విశేషం.
undefined
వంట చేయడం, పుస్తకాలు చదవడం, ఇల్లు సర్దడం, నిద్రపోవడం నాకు ఇష్టమైన వ్యాపకాలు అని ధన్యా ఓ నెటిజెన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇష్టపడతాను. రోడ్ సైడ్ దొరికే న్యూడుల్స్ తినడం అంటే భలే ఇష్టం అని ఆమె చెప్పడం గమనార్హం.
undefined
ఓ టెలివిజన్ షోలో నా నటనను చూసి హీరోయిన్ సిమ్రాన్ చాలా సహజంగా నటించావని మెచ్చుకున్నారు. అది నా జీవితంలో గొప్ప కంప్లిమెంట్ అన్నారు ధన్యా.
undefined
ఇక తన అందానికి కారణం మంచి ఫుడ్, పాజిటివ్ గా ఆలోచించడం అంటూ ధన్యా చెప్పారు.
undefined
ప్రస్తుతం ఫ్లిప్ ప్లాప్, 2020 అనే పేరుతో తెరకెక్కుతున్న రెండు కన్నడ చిత్రాలలో నటిస్తున్నారు.
undefined
click me!