మలయాళం సినిమా ప్రేమం నుంచి మొదలుపెట్టి, తమిళం, తెలుగు సినిమాలతో స్టార్ హీరోయని్ గా మారింది సాయి పల్లవి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో మెరుస్తుంది సాయి పల్లవి. ఈ సహజ సౌందర్యానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సింప్లీ స్టార్ నుంచి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం.
సాయి పల్లవి తన సహజ సౌందర్యం, సినిమా పాత్రల ఎంపిక విషయంలో అందరికింటే చాలా భిన్నంగా ఉంటారు. అందుకే ఆమెకు అభిమానులు ఎక్కువ. బయట తాను ఎలా ఉంటుందో సినిమాల్లో కూడా అలానే ఉండటానికి ఇష్టపడుతుంది సాయి పల్లవి. డబ్బుకోసం పాకులాడకుండా.. విలువలకు ప్రాధాన్యత ఇస్తూ.. తనకు నచ్చిన సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సినిమాల కోసం ఆమె ఎంచుకునే పాత్రలన్నీ అర్థవంతమైనవే. కథ నచ్చాలి, కథలో తన పాత్ర బాగుండాలి, యాక్టింగ్ స్కోప్ ఉండాలి, అలా ఉంటేనే సినిమాలను ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న సినిమాలో ఆ పాత్రకు న్యాయం చేస్తుంది సాయి పల్లవి.
సాయి పల్లవికి ప్రజాదరణ వచ్చాక కూడా అన్ని సినిమాలు హిట్ కాలేదు. కొన్ని సినిమాల్లో ఓటమి చవిచూసింది. కానీ ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఓటమిలో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో, కృషితో ముందుకు సాగింది. ప్రతి అమ్మాయిలోనూ ఈ ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలా అందరికి ఆదర్శంగా నిలుస్తుంది సాయి పల్లవి.