32 ఏళ్ళ తరువాత బాలకృష్ణతో విజయశాంతి సినిమా? ఇద్దరు కలిసి చేసిన చివరి సినిమా ఏదో తెలుసా?

Published : Apr 25, 2025, 10:59 AM IST

రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతోంది సౌత్ లేడీ అమీతాబచ్చన్ విజయశాంతి. అయితే వరుస సినిమాలు కాకుండా..సెలక్టీవ్ గా వెళ్తోంది.  గతంలో చిరంజీవి, బాలయ్య తో ఎక్కవ సినిమాలు చేసింది విజయశాంతి. ఆతరువాత కాలంలో హీరోల సరసన నటించడం మానేసి సోలో సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది విజయశాంతి. దాదాపు 3 దశాబ్ధాల గ్యాప్ తరువాత మరోసారి బాలయ్యతో మూవీ చేయబోతోందని తెలుస్తోంది. ఇంతకీ బాలకృష్ణతో విజయశాంతి ఏ సినిమాలో కనిపించబోతోందో తెలుసా? 

PREV
15
32 ఏళ్ళ తరువాత బాలకృష్ణతో విజయశాంతి సినిమా? ఇద్దరు కలిసి చేసిన చివరి సినిమా ఏదో తెలుసా?

అప్పట్లో బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.  చిరంజీవి తరువాత విజయశాంతి ఎక్కువ సినిమాలు చేసింది బాలయ్యతోనే. అయితే వీరి కాంబినేషన్ ఒక టైమ్ లో ఆగిపోయింది. ఈ ఇద్దరు స్టార్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే తరువాత కాలంలో సినిమాలు చేయలేదనే టాక్ వచ్చింది. బాలయ్య , విజయశాంతి కాంబినేన్ లో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. ఈ సినిమా టైమ్ లోనే ఇద్దరి మధ్య ఏవో ఇష్యూస్ వచ్చాయని టాక్ నడించింది. అయితే అప్పటి నుంచి  ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.  

Also Read: మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
 

25

అయితే ఈ వార్తలపై ఇన్నేళ్లకు క్లారిటీ ఇచ్చింది విజయశాంతి. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నిప్పురవ్వ తరువాత నేను బాలయ్య కలిసి సినిమాలు చేయలేదు. అప్పుడు మామధ్య గొడవలు వచ్చాయని ప్రచారంజరిగింది. కాని అందులో నిజం లేదు. నిప్పురవ్వ తరువాత నాకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అవకాశాలు వచ్చాయి. రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సోలోగా హిట్లు కొట్టడంతో, హిరోల సరసన నటించే అవకాశం లేకుండా పోయింది, అందుకే మా కాంబోలో సినిమా రాలేదు కాని.. మామధ్య ఏ గోడవలు రాలేదు అని క్లారిటీ ఇచ్చింది విజయశాంతి. 

Also Read: సైరా బానుతో విడాకులు, విమర్శలపై ఫస్ట్ టైమ్ నోరు విప్పిన ఏఆర్ రెహమాన్

35

ఇక దాదాపు 32 ఏళ్ళ తరువాత  బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో 'అఖండ 2'  సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమా  షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.

ఈసినిమాలో బాలకృష్ణ సరసన  హీరోయిన్ గా  సంయుక్త మీనన్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్రలో విజయశాంతి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో నటించమని  విజయశాంతిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.

45
Vijayashanthi Quits BJP

దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల ఆమెను కలిసి కథ, పాత్ర ప్రాముఖ్యతను వివరించారని, పాత్ర నచ్చడంతో నటించేందుకు విజయశాంతి కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అయితే ఈ విషయంలో అధికారికంగా మాత్రం ఎటువంటి  ప్రకటన రాలేదు. ఒక వేళ ఇది నిజం అయితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.  ఇప్పటి వరకూ విజయశాంతి పొలిటికల్ పాత్రలో కనిపించలేదు. మరి ఈ సినిమాలో నిజంగా పొలిటికల్ లీడర్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి. 

Also Read:  స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?

55
Boyapati Srinu to shoot akhanda 2 in unexplored locations Nandamuri Balakrishna

ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ దశలో ఉండగానే పలు ఏరియాల్లో బిజినెస్ డీల్స్ పూర్తయినట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక స్థాయిలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యుల్ కోసం మూవీ టీమ్  జార్జియాకు వెళ్లనుంది.

మే నెల మొత్తం అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమా నుంచి బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10 ఫ్యాన్స్ ఊహించని అప్ డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలని అనరకుంటున్నారట టీమ్. 

Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories