పెళ్లి తరువాత జాక్‌పాట్ కొట్టిన కీర్తి సురేష్, స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నటి

పెళ్లి తరువాత మరింతగా బిజీ  అయ్యింది హీరోయిన్ కీర్తి సురేష్. పెళ్లి అవ్వకముందు కంటే ఇప్పుడే ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.  ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్‌కి ఓ భారీ సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

Keerthy Suresh to Star Opposite Suriya in His 46th Film in telugu jms

 ప్రస్తుతం సౌత్ సినిమాలో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్  కీర్తి సురేష్. రీసెంట్ గా ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. గత సంవత్సరం అట్లీ నిర్మాణంలో విడుదలైన బేబీ జాన్ చిత్రం ద్వారా హిందీలో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ చిత్రం పరాజయం పాలైంది. దీంతో బాలీవుడ్‌కు వీడ్కోలు పలికి మళ్ళీ దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట.

Also Read: మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

సూర్యాతో కలిసి నటిస్తున్న కీర్తి సురేష్

పెళ్లి తరువాత మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది కీర్తి సురేష్. రీసెంట్ గా  కీర్తి సురేష్‌ మరో  జాక్‌పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. అలాంటి  అవకాశం ఆమెకు  వచ్చింది. సార్, లక్కీ బాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నారట. ఈ చిత్రంలో సూర్యాకి జోడీగా ఆమె సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇది సూర్యా 46వ సినిమా. ప్రస్తుతం ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 

Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.


సూర్యా 46 హీరోయిన్ కీర్తి సురేష్

సూర్య, కీర్తి సురేష్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు. కాని ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వచ్చిన  దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ సూర్యాతో కలిసి నటిస్తున్నారు కీర్తి సురేష్.  ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?

కీర్తి సురేష్ భర్త ఆంటోనీ

కీర్తి సురేష్‌కి గత సంవత్సరం పెళ్లయింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాల్లో పెద్దగా నటించకపోవడంతో కీర్తి సురేష్ సినీ పరిశ్రమ నుంచి తప్పుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది కీర్తి. ఇక  ఇప్పుడు సూర్య 46 చిత్రంలో హీరోయిన్ గా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: సైరా బానుతో విడాకులు, విమర్శలపై ఫస్ట్ టైమ్ నోరు విప్పిన ఏఆర్ రెహమాన్

Also Read:  సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

Latest Videos

vuukle one pixel image
click me!