Intinti Gruhalakshmi: జరిగిన అవమానం గురించి ఇంట్లో చెప్పిన నందు.. దివ్యని తనవైపుకు తిప్పుకున్న లాస్య?

First Published Jan 19, 2023, 10:22 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో నందు దిగులుగా ఉండడంతో ఇంతలో అనసూయ అక్కడికి వెళ్లి ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ఇలా రా అలా వచ్చి కూర్చో అని అనసూయ కూర్చోబెడుతుంది. అప్పుడు తులసి నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు అభి అదేంటి డాడ్ మీరు వచ్చారు కారు శబ్దం వినిపించలేదు అనగా కారు ప్రస్తుతానికి నాతో లేదు కారు ఈఎమ్ఐ కట్టలేదని చెప్పి నడిరోడ్లో దింపేసి కారు తీసుకుని వెళ్లిపోయారు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వడ్డీతో సహా కడతాను చెప్పాల్సింది డాడ్ అనగా ఇంట్లో వాళ్ళకే నా మీద నమ్మకం లేదు. బిజినెస్ చేద్దాము అంటే ఎవరు నాకు సపోర్ట్ గా లేరు ఇంతమంది బలగం ఉన్న ఏ రోజు నేను చెప్పుకోలేదు అని బాధపడుతూ ఉంటాడు నందు.

 నేను ఎప్పుడూ ఒంటరివాడినే అని అంటాడు. అప్పుడు తులసి నిస్వార్ధమైన నమ్మకం నిస్వార్ధమైన ప్రేమ మనల్ని ఎప్పుడూ మోసం చేయవు అని అంటుంది. కాలం కలిసి రానప్పుడు మనం చేసే ప్రయత్నం ఏది అయిన కలిసి రాదు. అంత మాత్రానికే మనము మనల్ని చేతగాని వాళ్ళము అని ముద్ర వేసుకోకూడదు అని అంటుంది. ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో చాలాసార్లు ఎదుర్కొన్నాను అనుభవంతో చెబుతున్నాను కిందపడిన ప్రతిసారి లేచి నిలబడితేనే రేసులో గెలుస్తాము అని తులసి మంచి మాటలు చెబుతూ ఉంటుంది. ఇవి మీకు తెలియనివి కాదు అని నేను చెప్పడం లేదు కానీ గుర్తు చేస్తున్నాను అని చెప్పి తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నందు కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉండగా ఇంతలోనే లాస్య అక్కడికి వస్తుంది.
 

అప్పుడు నందు కాలు నొక్కుతూ మనకు లక్షన్నర అప్పు ఎవరైనా ఇస్తాడా అనగా నాకు తెలుసు నువ్వు కాలు నొక్కుతున్నప్పుడే నాకు ఏదో తిరకాసు పెడతామని అర్థమయింది ఇంటర్వ్యూ కూడా డబ్బులు లేక ఇలా నడుచుకుంటూ వచ్చి కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను అనడంతో అప్పుడు జరిగింది మొత్తం వివరిస్తాడు నందు. అయినా నీకు డబ్బులు ఎందుకు అని నందు అడగడంతో దివ్య కావాలని అడిగింది నిన్ను అడిగిందా అని అడగగా లేదు తులసిని అడిగింది అనడంతో నీకెందుకు ఆవేశం అంటాడు నందు. వాళ్ళమ్మ కొనివ్వనని చెప్పింది అనడంతో అలా అని నువ్వు పూసుకున్నావా. మాట ఇచ్చావా దారిన పోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదే అని అంటాడు నందు. అలా మాట్లాడతావ్ ఏంటి నందు మాజీ మొగుడు మాజీ పెళ్ళాం ఇద్దరు ఒకటే విధంగా మాట్లాడుతున్నారు అనగా ఇప్పుడు నేను అప్పు తీసుకురావడం అంటే నిన్ను తాకట్టు పెట్టడమేనంతో లాస్య షాక్ అవుతుంది.

 హారతి ఇచ్చావు ఎదురొచ్చావు ఇంటర్వ్యూ పాయే కారు పాయే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు శృతి మొబైల్ చూస్తూ ఉండగా ఇంతలోనే తులసి పాలు తీసుకుని వస్తుంది. ఇప్పటినుంచి నీ మొబైల్ తక్కువగా చూస్తూ యుగాలు ఎక్సర్సైజులు వాకింగ్ లు చేయాలి మంచి బిడ్డ పుడుతుంది అనడంతో అంకిత అక్కడికి వచ్చి ఏంటి ఆంటీ బిడ్డ పుడుతుంది అంటున్నారు మనవరాలు అని ఫిక్స్ అయిపోయారా అనగా అవును మహాలక్ష్మి రావాలి అని అంటుంది తులసి. తులసి సమాజంలో ఆడపిల్లలను ఎలా చూస్తున్నారు అన్న విషయాన్ని చెప్పడంతో అంకిత శృతి వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. ఆడపిల్ల కూడా అందరికీ ఏ మాత్రం తక్కువ కాదు అని అందరికీ తెలిసేలా చేయాలి అంటుంది తులసి.
 

అప్పుడు వారు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు వాకింగ్ చేయాలి నీకు కంపెనీగా అంకిత వస్తుంది అనడంతో ఆంటీ అని అంకిత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఎవరు ఉన్నా లేకపోయినా నేను మీతో వస్తాను అని చెప్పి తులసి శృతిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరోవైపు దివ్య చదువుకుంటూ ఉండగా ఇంతలోనే లాస్య తన లాప్టాప్ తీసుకొని వచ్చి ఇవ్వడంతో అయ్యో వద్దు ఆంటీ నేను ఎలాగో అలా సర్దుకుంటాను అనడంతో మరి నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు దివ్య అని దివ్య కు నచ్చచెప్పి తన లాప్టాప్ ఇస్తుంది లాస్య. అప్పుడు లాస్య, దివ్యతో తులసి గురించి తప్పుగా చెబుతూ నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలి అనుకున్నాను కానీ మీ అమ్మ మనల్ని ఎప్పుడు కలవనివ్వలేదు అని తులసిని బ్యాడ్ చేస్తూ మాట్లాడుతుంది.
 

నువ్వు మీ అమ్మ మాటలు నమ్మి నన్ను ద్వేషించే దానివి అనడంతో అవును ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఎవరు మంచి వారు ఎవరు ఎలాంటివారో నాకు తెలిసి వస్తుంది అని అంటుంది దివ్య. నాకు ఎటువంటి కష్టం వచ్చినా నేను మీతో షేర్ చేసుకుంటాను మీ మాటే వింటాను. మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను అనగా మీ అమ్మ కోప్పడుతుందేమో అనడంతో రానివ్వండి నాకు సంబంధం లేదు అని అంటుంది దివ్య. అప్పుడు లాస్య మరిన్ని మాయమాటలు చెప్పి దివ్యని తన వైపుకు తిప్పుకుంటుంది. అప్పుడు ఈరోజు పార్టీ ఉంది వెళ్లాలి అని దివ్య టెన్షన్ పడుతూ మాట్లాడగా నువ్వేం భయపడకు మొత్తం నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరి మీ ఫ్రెండ్ వాళ్ళ పార్టీకి వెళ్ళు అని లాస్య దివ్య రెచ్చగొడుతుంది. 
 

అప్పుడు దివ్య సంతోష పడుతూ పార్టీకి రెడీ అవ్వడానికి వెళుతుంది. మరొకవైపు తులసి దగ్గరుండి శృతికి వాకింగ్ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి ఇంటి వారసురాల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇంట్లో బుడిబుడి అడుగులేస్తూ వారసురాలు వచ్చింది అంటే చాలు ఎంత బాధలు ఉన్నా కూడా అందరూ సంతోషంగా ఉంటారు అని అంటుంది. నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని తులసి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది.
 

ఇంతలోనే దివ్య పార్టీకి రెడీ అయి తులసి దగ్గరికి వెళ్లి నిలబడగా తులసి దివ్యని చూస్తూ ఉంటుంది. అప్పుడు తులసి గట్టిగా ఏంటి రెడీ అయ్యావు ఎక్కడికి బయలుదేరారు అని అనడంతో దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగక కాలేజీలో స్పెషల్ క్లాసులు ఉన్నాయి అనగా ఈ టైంలో స్పెషల్ క్లాసులు ఏంటి అనడంతో దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే లాస్య అక్కడికి వస్తుంది. బోన్ లో ఖైదీని నిలదీసినట్టు అలా నిలదీస్తావ్ ఏంటి తులసి అనడంతో ఇప్పటివరకు చెప్పలేదు కానీ ఇలా సడన్ గా చెప్పింది అందుకే అడుగుతున్నాను అని అంటుంది.

click me!