అక్కడ 'అల వైకుంఠపురములో' హంగామా, రెడ్ డ్రెస్ మెరుపులతో కృతి సనన్.. జిప్ జారితే కుర్రాళ్ళకి కష్టమే

First Published Jan 26, 2023, 1:23 PM IST

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది.

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. 

ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఆమె స్వతహాగా మోడల్ కాబట్టి నాజూగ్గా అందాలు ఎలా మైంటైన్ చేయాలో బాగా తెలుసు. 

తాజాగా కృతి సనన్ ఫోటోలు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. ఓపెన్ షోల్డర్ టాప్, జిప్ తో ఉన్న థైస్ స్ప్లిట్ రెడ్ డ్రెస్ లో కృతి మెరుపులు మెరిపిస్తోంది. ఆ జిప్ కొంచెం జారితే కుర్రాళ్ల హృదయాలకు పెద్ద ప్రమాదమే అంటూ నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

అల వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది.  రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని షెహజాద అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  కార్తీక్ ఆర్యన్ తన స్టైల్ లో చేయాలని ప్రయత్నించినప్పటికీ గెటప్స్ విషయంలో బన్నీని ఫాలో అయ్యాడు. మ్యానరిజమ్స్ కూడా చాలా వరకు బన్నీని గుర్తు చేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. 

ప్రమోషన్స్ లో భాగంగానే కృతి సనన్ కళ్ళు చెదిరే పరువాలతో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో కలసి ఆమె రొమాంటిక్ గా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

click me!