ధోని, కోహ్లీ, యువరాజ్, రోహిత్ శర్మ, రాహుల్... స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసిన ఇండియన్ క్రికెటర్స్!

First Published Nov 19, 2023, 3:22 PM IST


క్రికెట్ కి బాలీవుడ్ కి అవినాభావ సంబంధం ఉంది. ఇండియన్ క్రికెట్ కి ముంబై వేదికగా ఉండగా అక్కడే బాలీవుడ్ నెలకొంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు. 
 

Indian Cricketers Dated with Heroines

ఇండియన్ టీమ్ లో స్టార్ క్రికెటర్ అయితే చాలు. ఎక్కడ లేని కీర్తి, కోట్ల సంపాదన వచ్చి పడుతుంది. ఇక ఎఫైర్స్ కొదవేలేదు. మన ఇండియన్ క్రికెటర్స్ పలువురు స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారు... 
 

Indian Cricketers Dated with Heroines

ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ హీరోయిన్ సోఫియా హయత్ తో డేటింగ్ చేశాడని సమాచారం. అనంతరం స్పోర్ట్స్ మేనేజర్ రితిక సజ్దే ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  
 

Indian Cricketers Dated with Heroines

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే ప్రముఖంగా వినిపించిన పేర్లు రాయ్ లక్ష్మి, దీపికా పదుకొనె. కెరీర్ బిగినింగ్ లో ధోని ఈ ఇద్దరు హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారనే వాదనలు ఉన్నాయి.
 

Indian Cricketers Dated with Heroines

ఒకప్పటి స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ మన్మథుడుగా పేరు గాంచాడు. యువరాజ్ ఎఫైర్స్ లిస్ట్ పెద్దదే. దీపికా పదుకొనె, నేహా ధూపియా, కిమ్ శర్మ, ప్రీతి జింటాలతో యువరాజ్ ఎఫైర్స్ నడిపారనే వాదన ఉంది. 
 

Indian Cricketers Dated with Heroines

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మతో డేటింగ్ చేసి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి. అనుష్క శర్మ కంటే ముందు ఇజబెల్లా లైట్ అనే హీరోయిన్ తో డేటింగ్ చేశాడు. 
 

Indian Cricketers Dated with Heroines

బౌలర్ శ్రీకాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో టీమ్ ఇండియాకు దూరం అయ్యాడు. ఇతడు హీరోయిన్ రియా సేన్ తో డేటింగ్ చేశాడనే వాదన ఉంది.
 


యంగ్ సెన్సేషన్ కే ఎల్ రాహుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. అనంతరం నటుడు సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 

ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్య సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్ తో డేటింగ్ చేశాడు. ఆమె గర్భం దాల్చాక పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి. 
 

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోయిన్ గీతా బస్త్రాతో డేటింగ్ చేశాడు. ఆమెను 2016లో వివాహం చేసుకున్నాడు. 

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ గంగూలీ హీరోయిన్ నగ్మాతో చాలా కాలం డేటింగ్ చేశాడనే పుకారు ఉంది. చాలా కాలం వీరి మధ్య ఎఫైర్ నడిచింది. 

యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేశాడనే వార్తలు వున్నాయి. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడని సమాచారం. 

మా కోసం ఈ త్యాగం చేయండి.. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అమితాబ్ కి ఫ్యాన్స్ రిక్వస్ట్, స్వీట్ వార్నింగ్
 

click me!