కియారా అద్వాని- సిద్థార్థ్ మల్హోత్రా పెళ్ళి చేసేసుకున్నారా..? నెటిజన్లకు అనుమానం ఎందుకు వచ్చింది..?

First Published Oct 8, 2022, 10:30 AM IST

బాలీవుడ్ బ్యూటీఫుల్ లవ్ కపుల్ కియారా అద్వాని-సిద్థార్థ్ మల్హోత్రా. ఈ ఇద్దరు  స్టార్లు పెళ్ళి చేసుకున్నారా..? నెటిజన్లకు ఇదే అనుమానం వచ్చింది. ఇంతకీ వారికి ఈ అనుమానం ఎందుకు వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా..? ఈరకంగా చూస్తే వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా..?

బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా అద్వాని-సిద్థార్థ్ మల్హోత్రా సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్ అదే. అంతే కాదు ఈ డౌట్ ను రేజ్ చేసింది కూడా నెటిజ్లే. మరి వాళ్లకు ఎందుకు ఈ అనుమానం వచ్చిందో ఏమో కాని. ఈ జంటకు నిజంగా పెళ్లి జరిగి ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇక అయితే రీసెంట్ గా ఈ జంట కలిసి ఓ ఆడ్ ఫిల్మ్ లో నటించారు. ఈ ఆడ్ లో ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు.  అతని కంట్లో నలుసు పడితే.. ఆమె ఊదటం.. ప్రేమగా నిజమైన భార్య భర్తలు ఎలా ఉంటారో అలా ఉండటంతో నెటిజన్లకు లేని పోని అనుమానం వచ్చింది. వచ్చి రావడంతోనే.. అడిగేయడంతో పాటు కడిగేశారు కూడా. 

మేము ప్రేమించుకుంటున్నాం అని ఎక్కడా చెప్పకపోయినా.. చెట్టా పట్టాల్ వేసుకుని తిరడగంలో మాత్రం ముందుంటారు కియారా అద్వాని -సిద్థార్థ్ మల్హోత్రా. సమ్మర్ ట్రిప్ లు.. న్యూ ఇయర్ ట్రిప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎక్కడ పడితే అక్కడ ఈ జంట జనాల కంట పడుతూనే ఉన్నారు.  అయినా ప్రేమ విషయంలో మాత్రం మౌనమే సమాధానం అవుతుంది. 

ప్రేమ లేదంటారు.. పెళ్ళి లేదంటారు.. వేశాలకేమి తక్కువ లేదు. మీరు చేసే పనులు చూస్తుంటే సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్నట్టు ఉన్నారు అంటూ డౌట్ వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. బాలీవుడ్ లో చాలా మంది జంటలు ఇలా ప్రేమించుకుని సడెన్ గా పెళ్ళిళ్లు చేసుకున్నాు. మీరు కూడా చెప్ప కుండా పెళ్లి చేసుకున్నారా అని అడుగుతున్నారు. 
 

ఇక ఆ మధ్య కఫీ విత్ కరణ్ షోకి విడి విడిగా వచ్చిన ఈ ఇద్దరు స్టార్లకు కరణ్ జోహార్ షాకింగ్ క్వశ్చన్స్ తో బుర్ర తిరిగేలా చేశాడు.  ఇండైరెక్ట్ గా వీరు లవ్వర్స్ అని ఒప్పుకునేలా చేశాడు కరణ్. ఇక ఈ ఇద్దరు స్టార్లు నెటిజన్లు అనుకుంటున్నట్టు పెళ్ళి చేసుకున్నారా..? లేక త్వరలో సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారా చూడాలి మరి. 

click me!