మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Chiranjeevi and Nani Missed Blockbuster: ఈమధ్య కాలంలో మల్టీ స్టారర్ మూవీస్ హావా బాగా నడిచింది. కాని ప్రస్తుతం.. ఈ ట్రెండ్ చాలా వరకూ తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు పాన్ఇండియా ఇమేజ్ కోసం సోలో సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ పెడుతున్నారు. దాంతో భారీ మల్టీ స్టారర్స్ కు అవకాశం లేకుండా పోతోంది. అయితే గతంలో చాలా మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి. కొన్నికాంబినేషన్లు మిస్ అయ్యాయి కూడా. అలా మిస్ అయిన కాంబోలో చిరంజీవి, నాని కాంబో కూడా ఉంది. వీరిద్దరి కలయికలో సినిమా రావల్సి ఉంది. కాని ఎలా మిస్ అయ్యిందో తెలుసా? 

Megastar Chiranjeevi and Nani Almost Came Together: The Missed Blockbuster That Never Happened in telugu jms

మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని. వీళ్ళిద్దరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరు హీరోలకు కెరీర్ పరంగా, వయసు పరంగా చూసుకున్నా సరిగ్గా 30 ఏళ్ళు తేడా ఉంది. నాని చిరంజీవి కంటే 30 ఏళ్ల చిన్నవాడు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన 30 ఏళ్ళ తరువాత నాని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇంత గ్యాప్ ఉన్న ఈ హీరోలలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. ఇద్దరు హీరోలు ఎటువంటి సినిమా బాక్  గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ హీరోలుగా ఎదిగారు. సొంత టాలెంట్ తో ఇదంతా సాధించగలిగారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు స్టార్లుగా ఎదిగారు.

Also Read:  మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.

Megastar Chiranjeevi and Nani Almost Came Together: The Missed Blockbuster That Never Happened in telugu jms

 మరి ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే.. సినిమా చేస్తే.. ఫ్యాన్స్ ఎంత దిల్ కుష్ అవుతారు కదా? ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల వైపు పరుగులు తీస్తోంది. మల్టీ స్టారర్ ట్రెండ్ తగ్గి.. సోలోగా పాన్ ఇండియాను గెలవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. అయిదారేళ్ల ముందు వరకూ కూడా మల్టీ స్టారర్ సినిమాల హవా గట్టిగా కొనసాగింది కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఇక ఇది పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని  ఈ ఇద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీ మిస్ అయ్యిందని మీకు తెలుసా? అవును వీరిద్దరి కాంబోలో మంచి కథతో మూవీ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయట. కాని అవి సెట్స్ మీదకు వెళ్ళలేదు. 

Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?


నాని నాగార్జున కలిసి దేవదాస్ సినిమాచేస్తున్న టైమ్ లోనే .. చిరంజీవి, నాని కాంబోలో కూడాయ ఓ ఎమోషనల్ డ్రామా కథతో సినిమా చేయాలని ప్రయత్నించారట. కాని అప్పుడు కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది. అందులో దేవదాస్ మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఈ ఆలోచన మొత్తంగా విరమించుకున్నారట మేకర్స్. అలా చిరంజీవి, నాని కాంబోలో మూవీ మిస్ అయ్యింది. 

Also Read:  సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

Nani starrer Hit 3 ott rights update

 ప్రస్తుతం నాని కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. సోలోగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. దాంతో వీరి కాంబోల సినిమా రావడం ఇక కష్టమేఅనుకోవచ్చు. కాని నాని నిర్మాతగా మాత్రం చిరంజీవి సినిమా తెరకెక్కుతోంది. ఆ రకంగా ఇద్దరి కాంబినేషన్ కలిసింది. నాని కూడా తన రూట్ మార్చాడు. డిఫరెంట్ కంటెంట్ ను ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 4 లో డిఫరెంట్ రోల్ ను పోషిస్తున్నాడు నేచురల్ స్టార్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు నేచురల్ స్టార్.  

Also Read: 3000 మంది ఆర్టిస్టులతో భారీ షెడ్యూల్, మహేష్ బాబు సినిమా కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి

super star chiranjeevi

ఇక 70 ఏళ్లకు చాలా దగ్గరలో ఉన్న చిరంజీవి.. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరంజీవి, త్రిష హీరోయిన్ గా నటించిన ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ తరువాత అనిల్ రావిపూడితో ఓ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు చిరు. అటు శ్రీకాంత్ ఓదేల్ డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఓ సినిమాను కమిట్అయ్యారు. ఆ మూవీని నాని స్వయంగా నిర్మిస్తున్నాడు.  

Latest Videos

vuukle one pixel image
click me!