రెడ్ జాకెట్‌ ధరించి కుర్రాళ్ల బాడీలో మంట పెడుతున్న కీర్తిసురేష్‌.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో `మహానటి` రచ్చ

First Published Oct 8, 2022, 10:05 AM IST

`మహానటి` కీర్తిసురేష్‌.. చాలా రోజుల తర్వాత ఇంటర్నెట్‌లో మెరిసింది. అభిమానులను కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

కీర్తిసురేష్‌(Keerthy suresh) ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె రెడ్‌ జాకెట్‌, రెడ్‌ ప్యాంట్‌ ధరించింది. జాకెట్‌ మధ్యలో నుంచి కొద్ది కొద్దిగా నడుము అందాలు చూపిస్తూ దోబూచులాడుతుంది. ఫ్యాన్స్ కి పరీక్ష పెడుతుంది కీర్తి. రెడ్‌ డ్రెస్‌లో ఈ భామ రెడ్‌ చిల్లీలా ఘాటు రేపుతుందంటున్నారు నెటిజన్లు. 

కీర్తిసురేష్‌ చాలా రోజుల తర్వాత ఇలా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లోమెరిసింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో అవి వైరల్‌ అవుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. కీర్తిని ఇంతటి ఘాటుగా చూసి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. 
 

కీర్తిసురేష్‌ ఇందులో స్టేజ్‌పై రచ్చ చేసింది. `డీజే టిల్లు`లోని పాటకి స్టెప్పులేసింది. అందరితో కలిసి డాన్సు చేసి హోరెత్తించింది. ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఈవెంట్‌కి ఊపు తీసుకొచ్చింది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

కీర్తిసురేష్‌ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. `మహానటి`తో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ భామ ఆ తర్వాత సరైన కథలను ఎంపిక చేసుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి.  చివరగా కీర్తిసురేష్‌ మహేష్‌బాబుతో కలిసి `సర్కారు వారి పాట` చిత్రంలో నటించింది. 
 

ఇందులో కాస్త బోల్డ్ గా నటించింది కీర్తిసురేష్‌. నటిగానూ ఓపెన్‌ అయ్యింది. ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే పాత్రలో అదరగొట్టింది. అంతేకాదు గ్లామర్‌ డోస్‌ పెంచింది. `మహేషా` సాంగ్‌లో ఏకంగా ఐటెమ్‌ హీరోయిన్‌ని తలపించేలా కనిపించడం గమనార్హం. ఈ పాటలోనూ మాస్‌ డాన్సులతో ఉర్రూతలూగించింది. మహేష్‌ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. కానీ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో ఆమె శ్రమ అంతా వృథా అయ్యిందని చెప్పొచ్చు. 
 

ప్రస్తుతం కీర్తి సురేష్‌ కేవలం `దసరా` సినిమాలోనే నటిస్తుంది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఊరమాస్ చిత్రమిది. ఇందులో ఆయనకు జోడీగా కీర్తి ఆడిపాడబోతుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. గతంలో మాదిరిగా కీర్తికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇదే ఇప్పుడు ఆమె కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. 
 

కీర్తిసురేష్‌ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. అవకాశాల కోసమో, తాను ఎలాంటి పాత్రలైనా చేస్తాననే హింట్‌ ఇవ్వడం కోసమోగానీ ఆమె క్రమంగా అందాల ఆరబోతకు తెరలేపుతూ ఆకట్టుకుంటుంది. అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ నిస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. మరి కీర్తి పడే గ్లామర్‌ కష్టాలు చూసైనా మేకర్స్ ఛాన్స్ లిస్తారేమో చూడాలి. 
 

click me!