ఇక నటిగా తెలుగు ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయింది కాజల్. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. చిరంజీవితోపాటు యంగ్ హీరోలందరితోనూ కలిసి నటించింది. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్, గోపీచంద్ వంటి వారితో జోడీ కట్టి వాహ్ అనిపించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది.