మేకప్ లేకుండా కనిపించి షాకిచ్చిన చందమామ కాజల్... ఆమెను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!

First Published May 23, 2021, 12:45 PM IST

భర్త గౌతమ్ కిచ్లుతో మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా గడిపేస్తుంది చందమామ కాజల్. పదేళ్లు రహస్య ప్రేమాయణం సాగించి, కోరుకున్న వాడి చేయి అందుకుంది ఆమె.

పెళ్లి తరువాత కూడా కాజల్ జోరు తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పై ఆమె సైన్ చేస్తున్నారు. కిచ్లు కూడా కాజల్ కి మంచి సప్పోర్ట్ ఇవ్వడంతో ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతుంది. ఖాళీ సమయం దొరికితే జంటగా వివహారాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ నవ దంపతులు.
undefined
కాజల్ కెరీర్ కి కిచ్లు సప్పోర్ట్ ఇస్తుంటే, ఆయన వ్యాపారాల అభివృద్ధికి కాజల్ చేతనైన సాయం చేస్తుంది. కిచ్లు వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ఆమె ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. తన ఫేమ్ తో సదరు ప్రొడక్ట్స్ కి భారీ ప్రచారం తెచ్చిపెడుతుంది.
undefined
కాగా గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా చెప్పుకొనే కాజల్ మేకప్ లేకుండా కనిపించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఉదయ కాలపు సూర్యుడి వేడిని ఆస్వాదిస్తూ బాల్కనీలో కూర్చున్న కాజల్ ఫోటోలకు ఫోజిచ్చారు.
undefined
ఉదయాన్నే మేకప్ లేకుండా నిద్రలేచిన ముఖంలో కాజల్ కనిపించారు. అందగత్తెకు మేకప్ అనేది అదనపు ఆకర్షణే కానీ, ఖచ్చితంగా అవసరం కాదని కాజల్ ని చూస్తే అర్థం అవుతుంది. మేకప్ లేకుండా కూడా కాజల్ చక్కని స్కిన్ టోన్ తో మెరిసిపోతుంది.
undefined
కాజల్ మేకప్ లెస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫోటోల క్రింద కామెంట్స్ రూపంలో ఫ్యాన్స్ అభిమానం చాటుకుంటున్నారు. కాజల్ క్రేజ్ ఏమిటో కామెంట్స్, లైక్స్ చూస్తే అర్థం అవుతుంది.
undefined
ఇక తెలుగులో చిరంజీవి కి జంటగా కాజల్ నటించిన ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తుంది కాజల్.
undefined
కాగా తమిళంలో ఐదు ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీలో కాజల్ హీరోయిన్ గా చేశారు. కొన్ని వివాదాల కారణంగా మూవీ విడుదల హోల్డ్ లో పడింది.
undefined
లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా చేసింది కాజల్. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ అనుకున్నంతగా ఆదరణ దక్కించుకోలేదు. అయితే కాజల్ నటనకు ప్రశంసలు దక్కాయి.
undefined
click me!