కత్తి లాంటి చూపులతో కిక్ ఇచ్చేలా కాజల్ లుక్... ఏముందిరా బాబు అంటూ టెంప్ట్ అవుతున్న ఫ్యాన్స్!

First Published Feb 3, 2023, 7:35 AM IST


కాజల్ లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. కత్తి లాంటి చూపులతో కుర్రగుండలకు గాయం చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు  అవుతున్నాయి. 
 


సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ జోరు చూపిస్తుంది. ఆమె వరుసగా ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. కాజల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 
 

తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ఖాతాలో వేసుకుంది. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. కెరీర్లో మొదటిసారి బాలయ్య(Balakrishna)తో ఆమె జతకడుతున్నారు. అధికారిక ప్రకటన రాకున్నా విశ్వసనీయ సమాచారం అందుతుంది. 

అలాగే  కాజల్ భారతీయుడు 2(Bharateeyudu 2) షూటింగ్ లో పాల్గొంటున్నారు. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. వివాదాల కారణంగా భారతీయుడు 2 చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. కమల్ హాసన్(Kamal Haasan) విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో తిరిగి షూట్ ప్రారంభించారు.


భారతీయుడు 2 లో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రకుల్ మరో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. భారతీయుడు 2 తో పాటు రెండు తమిళ, ఒక హిందీ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. హీరోయిన్ గా ఆమె వరుస ఆఫర్స్ పట్టేస్తున్నారు.
 

మరోవైపు భర్తకు వ్యాపారంలో తన వంతు సహాయం చేస్తుంది. గౌతమ్ కిచ్లు ఓ ఫర్నిచర్ సంస్థ కలిగి ఉన్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులకు కాజల్ ప్రచారం కల్పిస్తున్నారు. తన ఇమేజ్ ఉపయోగించి వ్యాపారం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు.
 

 కాగా కెరీర్, పర్సనల్ లైఫ్ రెంటినీ కాజల్(Kajal Aggarwal) పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తున్నారుకొడుకు నీల్ కిచ్లు ఆలనా పాలన చూసుకుంటూ మాతృత్వపు అనుభూతి పొందుతుంది. సక్సెస్ వెనుకపడుతూ ఫ్యామిలీ లైఫ్ కి దూరమయ్యే హీరోయిన్స్ కాజల్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ప్రొఫెషన్ లో కొనసాగుతూ కూడా ఎలా కుటుంబ విలువలు, సాంప్రదాయాలు పాటించవచ్చో కాజల్ నిరూపించింది.

click me!