నిర్మాతలే నాపై అందుకు పాల్పడ్డారు, ఏం చేయాలో తెలియలేదు... సోనాలీ బింద్రే సంచలన ఆరోపణలు

Published : May 03, 2024, 02:49 PM ISTUpdated : May 03, 2024, 04:01 PM IST

ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టిన సోనాలి బింద్రే చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశారు. తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, పుకార్లు గుప్పించారని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాలు గుర్తు చేసుకుంది...   

PREV
17
నిర్మాతలే నాపై అందుకు పాల్పడ్డారు, ఏం చేయాలో తెలియలేదు... సోనాలీ బింద్రే సంచలన ఆరోపణలు
Sonali Bendre

సోనాలీ బింద్రే 1994లో ఆగ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. సోనాలీ బింద్రే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో సోనాలీ బింద్రే మొదటి చిత్రం మురారి. 

27
Sonali Bendre

హీరోయిన్ అయ్యాక ఆరేళ్లకు సోనాలి బింద్రే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మురారీ సూపర్ హిట్. ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు ఇలా వరుస హిట్స్ ఇచ్చింది. 2004లో విడుదలైన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో నటించలేదు. 

 

37
Sonali Bendre

ప్రస్తుతం సోనాలీ బింద్రే వెబ్ సిరీస్లు చేస్తుంది. ఆమె నటించిన 'ది బ్రోకెన్ న్యూస్' సీజన్ 2 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సోనాలీ బింద్రే సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. 

47
Sonali Bendre


సోనాలీ బింద్రే మాట్లాడుతూ... నేను 1994లో పరిశ్రమలో అడుగుపెట్టాను. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. నిర్మాతలు కూడా అలానే ఉండేవారు. నా తోటి నటులతో ఎఫైర్ రూమర్స్ క్రియేట్ చేసేవారు. అలా చేస్తే సినిమాకు ప్రచారం దక్కుతుందని భావించేవారు. 
 

57
Sonali Bendre

మీడియాకు నిర్మాతలు స్వయంగా లీక్స్ ఇచ్చేవారు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో నేను సన్నగా ఉండేదాన్ని. అప్పట్లో హీరోయిన్స్ కొంచెం బొద్దుగా ఉండేవారు. నన్ను కూడా లావు కావాలని ఒత్తిడి చేసేవారు. నాపై బాడీ షేమింగ్ కి పాల్పడుతూ ఎగతాళి చేసేవారు. 

 

67
Sonali Bendre

బొద్దుగా అవ్వాలని ఎందరు క్లాస్ పీకినా నేను వినలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. అందుకే డాన్సు, యాక్టింగ్ నేర్చుకుంది లేదు. పరిశ్రమకు వచ్చాకే అన్నీ నేర్చుకున్నాను. నన్ను ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్ చేస్తారని అసలు ఊహించలేదు... అని అన్నారు. 

77
Sonali Bendre


కాగా సోనాలీ బింద్రే 2002లో గోల్డి బెహెల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కాగా 2018లో సోనాలి బింద్రే తాను మెటాస్టాస్టిక్ క్యాన్సర్ బారిన పడినట్టు వెల్లడించింది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ నుండి చికిత్స అనంతరం బయటపడ్డారు. 2021లో ఆమె క్యాన్సర్ నుండి కోలుకున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories