ఉన్నట్టుండి రష్మీ, సుధీర్‌ మాయం.. ఛీ సిగ్గులేదా అంటూ పూర్ణ సాఫ్ట్ వార్నింగ్‌.. బాబోయ్‌!

First Published Apr 18, 2021, 6:23 PM IST

రష్మీ, సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలపై జడ్జ్ పూర్ణ ఫైర్‌ అయ్యింది. ఉన్నట్టుండి యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్‌ కనిపించకపోవడంతో హైపర్‌ ఆది ముఖ్యం పట్టుకుని బండబూతులు తిట్టింది పూర్ణ. సుధీర్‌ని ఛీ సిగ్గులేదా ఇలా చేస్తావా? అంటూ సాఫ్ట్ వార్నింగ్‌ ఇచ్చింది. 

ఉన్నట్టుండి `ఢీ` డాన్స్ షో వేడెక్కింది. జడ్జ్ గా వ్యవహరిస్తున్న నటి పూర్ణ ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యింది. ఎప్పుడూ లేని విధంగా ఆమె నోటి వెంట బండబూతులు వచ్చాయి. హైపర్‌ ఆదిని టార్గెట్‌ చేస్తూ పచ్చి బూతులు తిట్టింది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..
undefined
`ఢీ` షో స్టార్ట్ అయ్యింది. డాన్సర్లు డాన్సులతో అలరింప చేస్తున్నారు. దుమ్మురేపుతున్నారు. కింగ్స్ టీమ్ లీడర్‌ సుడిగాలి సుధీర్‌, క్వీన్స్ టీమ్‌ లీడర్‌ రష్మీ ఎంత సేపటికీ కనిపించడం లేదు. ఉన్నట్టుండి వీళ్లు ఎక్కడికి మాయమైపోయారు. అసలే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే గాసిప్సులు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఢీ షోలోనే రొమాన్స్ లతో రెచ్చిపోయారు.
undefined
రష్మీ,సుధీర్‌ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని దీపికా పిల్లిని ప్రశ్నించింది పూర్ణ. అందుకు దీపికా పిల్లి స్పందిస్తూ, ఈ రోజు స్పెషల్‌ ఎపిసోడ్‌ కదా పూజ చేసుకుని రావడానికి రష్మీ వెళ్లిందని చెప్పింది.
undefined
సుధీర్‌ ఎక్కడా అంటూ హైపర్‌ ఆదిని పూర్ణ ఇదే విషయం ప్రశ్నించగా, మాకు పూజలు లాంటివి ఏం చేయం, మాదంతా చేతబడే బయట అని సమాధానమిచ్చాడు.
undefined
పూర్ణ స్పందిస్తూ ఏంటా ఆది రెస్పాన్సిబులిటీ లేదా? అడిగింది. దీనికి యాంకర్‌ ప్రదీప్ మరికొంత ఉప్పు చల్లాడు. దీంతో రగిలిపోయిన పూర్ణ బూతు పురాణం పెట్టింది. సిగ్గులేదా? దున్నుపోతులాగా సిగ్గులేకుండా ఒక్కడివే కూర్చున్నావు? అంటూ ప్రశ్నించింది.
undefined
అంతటితో ఆగలేదు పూర్ణ. ఇలా చేశారేంటి? అంటూ అసహించకుంది. ఛీ.. ఛీ అంటూ చిదరించుకుంది. ఇదంతా అక్కడ ఉన్నవారిని కడుపుబ్బ నవ్వించింది. కానీ వార్నింగ్‌ మాత్రం గట్టిగానే ఇచ్చింది పూర్ణ.
undefined
మధ్యలో డాన్సర్లు డాన్స్‌ చేస్తున్నారు. సైలెంట్‌గా వచ్చాడు సుధీర్‌. దీనిపై పూర్ణ స్పందించింది. `హాయ్‌ ఫ్రెండ్స్‌ లేట్‌గా వచ్చాను..` అని చెప్పమని చెప్పింది. ఇంతలో ప్రదీప్‌ దున్నపోతులా అంటూ ఆమెకి బూతులు అందించాడు.
undefined
దీంతో మరోసారి రెచ్చిపోయింది పూర్ణ. దున్నపోతులా.. సిగ్గులేకుండా..అడ్డ గాడిద, అచ్చొసిన నాంబోతు అంటూ తిట్ల దండకం అందుకుంది. అయితే పదం తప్పుపోవడంతో ఆది సరిచేశాడు. దీంతో మళ్లీ సుధీర్‌పై తిట్ల వర్షం కురిపించింది.
undefined
పూర్ణ ఇలా వరుసగా తనపై రెచ్చిపోయి తిట్లు తిడుతుండటంతో సుధీర్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఏమైంది ఇలా తిడుతుందంటూ షాక్‌కి గురయ్యారు. ఎలా స్పందించాలో అర్థం కాక నోరెళ్ల బెట్టాడు. మొత్తంగా సుధీర్‌కి సాఫ్ట్ వార్నింగ్‌ ఇచ్చింది పూర్ణ.
undefined
పూర్ణ మాత్రం ఆంబోతు తిడుతూనే ఉంది. దీంతో వారి మధ్య ఒక్కసారి పరిస్థితి హీటెక్కిపోయింది. ప్రదీప్‌, ప్రియమణి, ఆది, ఇతర కంటెస్టెంట్లు మాత్రం పూర్ణ తిట్లకి నవ్వుకున్నారు. లేటెస్ట్ `ఢీ` ప్రోమో మాత్రం ఆద్యంతం నవ్వులు పూయించింది. మరి షోలో ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తుందో చూడాలి.
undefined
పూర్ణ, ప్రియమణి జడ్జ్ లుగా, ప్రదీప్ యాంకర్‌గా, రష్మీ, దీపికా పిల్లి క్వీన్స్ టీమ్‌ లీడర్లుగా, సుధీర్‌, హైపర్‌ ఆది కింగ్స్ టీమ్‌ లీడర్లుగా ఈ షోలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఈ షో విజయవంతంగా రన్‌ అవుతూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తూ, ప్రతిభగల డాన్స్ లని పరిచయం చేస్తుంది. వారికి లైఫ్‌ ఇస్తుంది.
undefined
click me!