Janaki kalaganaledu: జెస్సిని రెచ్చగొడుతున్న మల్లిక.. అఖిల్ కోసం జానకిని టార్చర్ చేస్తున్న కుటుంబం!

First Published Nov 9, 2022, 11:44 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ప్లీజ్ వదిన నన్ను అర్ధం చేసుకో.. నేను ఏ తప్పు చెయ్యలేదు నమ్ము వదిన అని అఖిల్ ఎంత సీన్ చేసిన జానకి వినదు. మరోవైపు రామ చెప్పిన కూడా జానకి నిజం ఒప్పుకోవాలని అఖిల్ ని తిడుతుంది. ఒకసారి ఆలోచించండి జానకి గారు అని చెప్పిన ఇన్స్పెక్టర్ గారు నేను కంప్లైంట్ ఫైల్ చేసినట్టు అఖిల్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అని జానకి చెబుతుంది. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లగా కుటుంబం అంత షాక్ అవుతుంది. 
 

ఇక మల్లిక కొత్త సీన్ స్టార్ట్ చేస్తుంది.. ఏంటి జెస్సి నీ జాతకం ఇలా ఉంది.. ఎన్నో అవాంతరాలు దాటి నీకు అఖిల్ కు పెళ్లి అయ్యింది. ఇక అంత బాగుంటుంది అనుకుంటే ఇలా అయ్యింది ఏంటి అని అగ్గికి ఆజ్యం పోస్తుంది. నువ్వు తలుచుకుంటే నీ భర్త నిర్దోషి అని బయటకు తీసుకురావచ్చు అని అంటుంది. దాంతో జానకి దగ్గరకు వెళ్లి అఖిల్ మంచివాడు కాకపోవచ్చు కానీ చెడ్డ వాడు మాత్రం కాదు అని చెబుతుంది. అఖిల్ ఒక అమ్మాయిని చంపేంత దుర్మార్గుడు కాదు అక్క దయచేసి కంప్లైంట్ వెనక్కి తీసుకోని అఖిల్ ని విడిపించు అక్క అని జెస్సి అడుగుతుంది. 
 

నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు కేసు పెట్టారు అని రామా అడుగుతాడు. అఖిల్ చెడ్డవాడు అని నేను అనడం లేదు.. కానీ మాధురీ అనే అమ్మాయిపై మర్డర్ అటెంప్ట్ చెయ్యడం నేను కళ్లారా చూశాను.. న్యాయం బంధం కంటే గొప్పది రామా గారు అని అనడంతో జ్ఞానాంబ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఇంట్లోవారందరు జానకిని సీరియస్ గా చూస్తారు. అఖిల్ కి ఎం కాదు నిర్దోషిగా బయటకు వస్తాడు అని గోవిందా రాజు, జానకి చెప్తారు. దయచేసి కేసు వెనక్కి తీసుకోండి.. హంతకుడి కుటుంబంగా ముద్ర పడుతుంది.. వెన్నెల పెళ్లి కాదు అని బ్రతిమిలాడుతాడు. 
 

జానకి మాత్రం మూగదానిలా ఉంటుంది. మీ అందరి ఆవేదన అర్ధం చేసుకోగలను కానీ మీరు అంత ఒక్కసారి ఆస్పత్రికి వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ అమ్మాయిని చూడండి.. అది మీరు చూస్తే ఈ మాటలు మాట్లాడరు.. కేసు వెనక్కి తీసుకోవడం ఈ విషయానికి పరిష్కారం కాదు అని అంటుంది. దయచేసి ఈ విషయంపైన ఒత్తిడి తీసుకురాకండి అని అంటుంది. రూమ్ లోకి వచ్చిన జానకి బాధపడుతూ ఉంటుంది. మీ పరిస్థితి నాకు అర్ధం అయ్యింది అండి కానీ మీరు ఇంట్లో వారి పరిస్థితిని కూడా అర్ధం చేసుకోవాలి అని రామా అంటాడు. 
 

ఆ మాటలకూ జానకి సీరియస్ అవుతుంది. మీరు నన్ను చదివిస్తున్న చదువుకు అర్ధం లేకుండా పోతుంది అని జానకి అంటుంది. దయచేసి అర్ధం చేసుకోండి అని అంటుంది. అయినా అఖిల్ కు తప్పులు చెయ్యడం ఆనవాయితీ అయిపోయింది. మొన్న జెస్సి ఈరోజు మాధురీ అని జానకి అంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అని జానకి అంటే జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెబుతుంది. ఆ మాటలు విన్న రామా మీరు చుసిన ఆధారాన్ని బట్టి వంద శాతం అఖిల్ తప్పు చేశాడని  గ్యారెంటీ లేదండి అని రామా అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

click me!