ఫ్రెండ్స్ తో జాన్వీ కపూర్‌ గూఫీ డాన్స్.. స్పెషల్‌గా మాట్లాడాలంటూ అన్నయ్య అర్జున్ కపూర్‌ స్వీట్‌ వార్నింగ్‌..

First Published Jun 22, 2021, 10:59 AM IST

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ డాన్స్ వీడియో వైరల్‌గా మారింది. తన స్నేహితులతో కలిసి చేసిన గూఫీ డాన్స్ చక్కర్లు కొడుతుండగా, అన్నయ్య అర్జున్‌ కపూర్‌ కామెంట్‌ చేశాడు. స్పెషల్‌గా మాట్లాడాలంటున్న స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. 
 

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే చాలా యాక్టివ్‌గా ఉంటోంది. రెగ్యూలర్‌గా వీడియోలు, గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంది.
undefined
అప్పుడప్పుడు బీచ్‌లో బికినీ వీడియోలు పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది.
undefined
తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి గూఫీ డాన్స్ చేసింది. మ్యూజిక్‌ డేని పురస్కరించుకుని జాన్వీ ఇలా వివిధ ఏజ్‌ గ్రూప్‌కి చెందిన స్నేహితులతో కలిసి డాన్స్ చేసింది.
undefined
చిత్రవిచిత్రంగా ఉన్న ఈ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తెగ చక్కర్లు కొడుతుంది. ఆద్యంతం ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
undefined
ఈ నేపథ్యంలో అన్నయ్య అర్జున్‌ కపూర్‌ స్పందించారు. ఇన్‌స్టాలో ఓ కామెంట్‌ పెట్టాడు. `హమ్‌...దీని గురించి డిన్నర్‌ టైమ్‌లో సపరేట్‌గా మాట్లాడాలి` అంటూ ఓ రకంగా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.
undefined
అర్జున్ కపూర్‌ కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏం డిస్కస్‌ చేయబోతున్నాడంటూ ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు సెలబ్రెటీలు, నెటిజన్లు.
undefined
మరోవైపు ఇటీవల ఫాదర్స్ డే సందర్బంగా తండ్రి బోనీ కపూర్‌తో కలిసి అర్జున్‌ కపూర్‌, జాన్వీ, ఖుషీ కపూర్‌లో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.
undefined
శ్రీదేవి మరణం అనంతరం బోనీ, అర్జున్‌, జాన్వీ,ఖుషీలు మరింత దగ్గరయ్యారని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో తండ్రి బోనీకి, సిస్టర్స్ జాన్వీలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారట అర్జున్‌.
undefined
ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌ లక్‌ జెర్రీ`, `దోస్తానా 2` చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు అర్జున్‌ కపూర్‌ `భూట్‌ పోలీస్‌`, `ఏక్‌ విలన్‌ రిటర్న్స్` చిత్రాల్లో నటిస్తున్నారు.
undefined
ఇటీవల బీచ్‌లో బికినీ ఫోటోలు పంచుకుని కుర్రాళ్లకి చెమటలు పట్టించింది జాన్వీకపూర్‌.
undefined
click me!