టాలీవుడ్ లో పడిలేచిన కెరటం లాగా ఎదిగిన హీరోల్లో నితిన్ కూడా ఒకరు. నితిన్ కి కెరీర్ బిగినింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి. దిల్, జయం, సై లాంటి సూపర్ హిట్స్ దక్కడంతో నితిన్ క్రేజీ హీరోగా మారాడు. నితిన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇదంతా అతడు పదేళ్ల పరాజయాల నుంచి తిరిగి పుంజుకోవడం వల్లే జరిగింది.