జబర్దస్త్ లో లేడీ గెటప్ లను కూడా వదలని సుడిగాలి సుధీర్..!

First Published Dec 1, 2020, 12:32 PM IST

కేవలం రష్మీతో మాత్రమే కాకుండా సుధీర్ మీద తరచుగా అందరమ్మాయిలను గోకుతుంటాడని, పబ్బులో ఎవరో అమ్మాయితో కనబడ్డాడని ఇలా అనేక వదంతులు వ్యాపించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారిని కూడా వదలడం లేదు అనే ఒక టాక్ బయట హల్చల్ చేస్తుంది. 

తెలుగు టెలివిషన్ చరిత్రలోనే నిర్విరామంగా ప్రసారమవుతూ... ప్రేక్షకుల మన్ననలను పొందుతూ... ఎపిసోడ్ లు పెరుగుతున్న కొద్దీ వ్యూయర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కామెడీ షో జబర్దస్త్. ప్రతి వారం గురు, శుక్రవారాలు వస్తే ప్రేక్షకులు తమ రొటీన్ జీవితంలోని బాధలన్నిటిని మర్చిపోయి హాయిగా ఒక గంటపాటు నవ్వుకోవడానికి ఈ షో ని చూస్తుంటారు.
undefined
ఈ షో అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. సుధీర్ తన స్కిట్ల వల్లకన్నా రష్మీ తో కుదిరిన కెమిస్ట్రీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా సుధీర్ ని కనిపించినప్పుడల్లా అమ్మాయిల వెంట తిరుగుతాడు, పబ్బుల్లో ఉంటాడు, ఎప్పుడు ఎవరినో ఒక్కరిని గోకుతుంటాడు అని పదే పదే అందరూ అనడం, ఆ పంచులు కూడా పేలుతుండడంతో అతడికి ప్లే బాయ్ అనే ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. (Pic Credit Mallemala)
undefined
కేవలం రష్మీతో మాత్రమే కాకుండా సుధీర్ మీద తరచుగా అందరమ్మాయిలను గోకుతుంటాడని, పబ్బులో ఎవరో అమ్మాయితో కనబడ్డాడని ఇలా అనేక వదంతులు వ్యాపించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారిని కూడా వదలడం లేదు అనే ఒక టాక్ బయట హల్చల్ చేస్తుంది.(Pic Credit: ETV Dhee)
undefined
లేడీ గెటప్ వేసే అయ్యప్ప ఉరఫ్ తన్మయి తాజాగా కాష్ షో కి గెస్ట్ గా వచ్చింది. ఈ షో లో యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... తనను సుధీర్ అదోలా చూశాడని చెప్పుకొచ్చాడు. దానితో సుమ బ్రేకింగ్ న్యూస్ అంటూ లేడీ గెటప్ లు వేసేవారిని కూడా సుధీర్ వదలడం లేదు అంటూ ప్రకటించేసింది.(Pic Credit: Mallemalatv)
undefined
సుమ మాట్లాడిన ఈ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సుధీర్ కి ఇప్పటికే ఉన్న ప్లేబాయ్ ఇమేజ్ కి తోడు సుధీర్ లేడీ గెటప్ లు వేసేవారిని కూడా వదలడం లేదు అంటూ సోషల్ మీడియాలో అసలు విషయం తెలుసుకోకుండా, పూర్తి వీడియో చూడకుండానే మాట్లాడేసుకుంటున్నారు నెటిజన్లు.(pic credit: etvteluguindia)
undefined
అసలు విషయంలోకి వెళితే.. సుమ కాష్ ప్రోగ్రాంలో ఆడించే సుమ బాస్కెట్ బాల్ లీగ్ లో సుమ అందరిని ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలానే తన్మయి క్యారెక్టర్ వేసే అయ్యప్పని లేడీ గెటప్ లో ఉన్న నిన్ను ఆది, సుధీర్ లలో ఎవరు అదోలా చూసారు అని అడిగేసారు. దీనితో అవాక్కయిన తన్మయి బంతిని బాస్కెట్ లో వేసే ప్రయత్నం చేసింది (బంతిని బాస్కెట్ లో వేస్తే సమాధానం చెప్పే అవసరం ఉండదు). బంతి మిస్ అవడంతోసుధీర్ అని చెప్పేసింది. ఈ ప్రశ్న అడుగుతుండగా వెనకనుంచి శాంతి కావలనయినా బంతిని బాస్కెట్ లో వెయ్యదు అని అనడం కొసమెరుపు.(pic credit: etvteluguindia)
undefined
click me!