కొంగుచాటు అందాలు, నడుము మడతలు చూపిస్తూ చిలిపి పోజులతో కట్టిపడేస్తున్న `జబర్దస్త్` రష్మి.. ఫ్యాన్స్ కి పండగే

First Published Jan 19, 2022, 9:14 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా రాణిస్తున్న యాంకర్‌. వచ్చీ రాని తెలుగుతో ముద్దుముద్దు మాటలతో, కవ్వించే అందాలతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తుందీ హాట్‌ అందాల భామ. లేటెస్ట్ గా పంచుకున్న హాఫ్‌ శారీ పిక్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

రష్మి(Anchor Rashmi) సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలింది. సంక్రాంతి పండుగ సందర్బంగా స్పెషల్‌ షోలో ఆమె పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా హాఫ్‌ శారీలో మెరిసింది రష్మి(Jabardasth Rashmi). కొంగు తన నడుమందాలను దాయగా, నడుము మడతలు చూపిస్తూ కనువిందు చేస్తుంది. మరోవైపు చిలిపి పోజులతో కవ్వింపులకు దిగుతుంది యాంకర్‌ రష్మి. 

Jabardasth Rashmi ఇందులో విరహాలు పోతూ, కవ్విస్తూ,తన లెహంగా వోనీలో హోయలు పోయింది. రష్మి హాఫ్‌ శారీ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

రష్మి సంక్రాంతి కానుకగా ఓ సారి పంచుకోగా అవి తెగ ఆకట్టుకున్నాయి. కొంచెం గ్యాప్‌తో మరికొన్ని గ్లామర్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుందీ భామ. డిఫరెంట్ పోజులతో కుర్రాళ్లని మెస్మరైజ్‌ చేస్తుంది రష్మి. నెట్టింట దుమారం రేపుతుంది. 

`జబర్దస్త్` షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మి.. హాట్ యాంకర్‌గా మరింతగా ఆకట్టుకుంటుంది. తన అందచందాలతో టీవీ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. `జబర్దస్త్` షోకి యూత్‌ బాగా ఎట్రాక్ట్ కావడంలో రష్మి పాత్ర కీలకంగా ఉందని చెప్పొచ్చు. ఈ బ్యూటీ కోసమైనా షో చూడాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. 

మరోవైపు ఇందులో సుడిగాలి సుధీర్‌కి, రష్మిక జోడీ బాగా కుదురుతుంది. రష్మిపై వరుసగా పంచ్‌లు వేస్తూ తమ స్కిట్‌లను రక్తికట్టిస్తుంటాడు సుడిగాలి సుధీర్‌. అంతేకాదు ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్‌ స్కిట్లతో వీరిద్దరు స్టేజ్‌పై కెమిస్ట్రీని,రొమాన్స్ ని పండిస్తూ కుర్రాళ్లకి కావాల్సింత కంటెంట్‌ని అందిస్తున్నారు. 

అంతేకాదు మొన్నటి వరకు `ఢీ` షోలోనూ ఈ ఇద్దరు తెగ రచ్చ చేశారు. అయితే డాన్స్‌ షో కంటే వీరిద్దరి కెమిస్ట్రీనే బాగా హైలైట్‌ కావడంతో, వీరికే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ పెరిగిపోవడం, షోని డామినేట్‌ చేసే స్థాయికి చేరడంతో ఈ ఇద్దరిని తప్పించారు నిర్వహకులు. 
 

దీంతో ఆ లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. రష్మి, సుధీర్‌ లేని `ఢీ`ని చూడలేకపోతున్నామంటున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయంటే వీరి ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రష్మి కూడా సుధీర్‌ నుంచి బయటపడాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆమె సోలో షోస్‌లో పాల్గొంటూ తన నుంచి సుధీర్‌ ఇమేజ్‌ని పోగొట్టేలా ప్లాన్‌ చేసుకుంటుందని టాక్‌.

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా రాణిస్తున్న యాంకర్‌. వచ్చీ రాని తెలుగుతో ముద్దుముద్దు మాటలతో, కవ్వించే అందాలతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తుందీ హాట్‌ అందాల భామ. లేటెస్ట్ గా పంచుకున్న హాఫ్‌ శారీ పిక్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

click me!