రెండేళ్లుగా అతనిపై క్రష్‌.. `బిగ్‌ బాస్‌6` వేదికగా ఓపెనైన హాట్‌ కంటెస్టెంట్‌ ఇనయ.. సీక్రెట్‌ చెప్పిన సోహైల్

First Published Nov 26, 2022, 11:13 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగు షోలో హాట్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది ఇనయ. ఆమె ఓ వ్యక్తిపై క్రష్‌ పెంచుకుందట. ఆయన్ని కలిసేందుకు రూమ్‌ కూడా షిఫ్ట్ అయ్యిందట. కానీ జిమ్‌లో అలా చూసి డ్రాప్‌ అయ్యిందట. 

బిగ్‌ బాస్‌6 తెలుగు(Bigg Boss Telugu 6) షో ముగింపు రోజుల్లో మరింత రక్తి కడుతుంది. శనివారం ఎపిసోడ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఇందులో హోస్ట్ నాగార్జున(Nagarjuna) తనదైన స్టయిల్‌లో సందడి చేశారు. అదే సమయంలో ఈ వారం ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంట్లోకి పంపించి వారిని హ్యాపీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టేజ్‌పైకి మరో ఫ్యామిలీ మెంబర్స్ ని ఆహ్వానించి సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతేకాదు సెలబ్రిటీలతో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ని రెట్టింపు చేశాడు. 
 

అందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసక్తికర విషయాలు, సీక్రెట్లు బయటపడ్డాయి. అందులో ఇనయ సీక్రెట్‌లు బయటపడటం విశేషం. ఇనయ(Inaya) కోసం శనివారం ఎపిసోడ్‌లో బిగ్‌ బాస్‌ 4 స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌, మోస్ట్ పాపులర్‌ అయిన కంటెస్టెంట్‌ సోహైల్‌ వచ్చాడు. ఇనయ బ్రదర్‌ ఇమ్రాన్‌ తో కలిసి ఆయన షోలో సందడి చేయడం విశేషం. 
 

ఈ సందర్భంగా ఇనయకి సంబంధించిన సీక్రెట్లు బయటపెట్టారు. ఆమె క్రష్‌ని బయటపెట్టాడు సోహైల్‌. తన కోసం ఆమె మణికొండకి షిప్ట్ అయ్యిందట. తనని కలిసేందుకు తాను వర్కౌట్‌ చేసే జిమ్‌లోనే చేరిందన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జిమ్‌ మానేసిందట. అందుకు కారణం తెలియదన్నారు. ఆ కారణం ఇనయ చెప్పింది. రెండేళ్లుగా సోహైల్‌పై క్రష్‌ ఏర్పడిందన్నారు. ఎలాగైనా ఆయన్ని కలవాలని, సోహైల్‌ మణికొండలో ఉంటున్నాడని తెలుసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యింది. సోహైల్‌ చేసే జిమ్‌లోనే చేరిందట. 

కానీ సోహైల్‌ తరచూ ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడేవాడని, వారితో క్లోజ్‌గా ఉండేవాడని, అది చూసి తాను జెలసీగా ఫీలయ్యానని తెలిపింది ఇనయ. దీంతో ఆ జిమ్‌ ని వదిలేశానని తెలిపింది. కానీ సోహైల్‌ తో మాట్లాడుకున్నానని, ఆయన నెంబర్‌ తీసుకోవాలనుకున్నానని, అది కుదరలేదని తెలిపింది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ 6 వేదిక కలవడం, మాట్లాడటం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఇనయలోని చెడ్డ అలవాటు చెప్పాడు తమ్ముడు ఇమ్రాన్‌. ఆమెకి కోపం వస్తే అన్నం తినదని వెల్లడించారు. 
 

ఇక ఈసందర్భంగా పది మార్కులకు 8 మార్కులు తన ఆటతీరుకి ఇస్తానని తెలిపాడు. అదే సమయంలో ఇనయకి రేవంత్‌ కాంపిటీషన్‌ అవుతారని, ఆదిరెడ్డి కాంపిటీషన్‌ కారని చెప్పారు. ఇనయ బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌లో చివరి కెప్టెన్‌ కావడం విశేషం. మరోవైపు సోహైల్‌ హీరోగా `లక్కీ లక్ష్మణ్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. అది డిసెంబర్‌ 30కి విడుదల కానుంది. తన సినిమాని కూడా ప్రమోట్‌ చేసుకున్నాడు సోహైల్‌. ఇదిలా ఉంటే ఈ వారం ఇనయ ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ కావడం విశేషం.

click me!