లక్షలు ఇచ్చి ఆదుకున్న గణేష్ మాస్టర్ పై పంచ్ లు, ఢీ ముగియడంతో జడ్జెస్ కి ఆర్థిక కష్టాలు!

First Published Jul 23, 2021, 8:05 AM IST

డాన్స్ రియాలిటీ షో ఢీ కి జడ్జిగా గణేష్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్స్ నుండి జడ్జెస్ గా ఉన్న పూర్ణ, ప్రియమణితో ఆయన జాయిన్ అయ్యారు. ఇక ఢీ లేటెస్ట్ సీజన్ ఫైనల్ కి చేరువవుతుండంతో వీరికి ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయట. 

జబర్దస్త్, ఢీ, క్యాష్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన షోలను నిర్మిస్తూ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బుల్లితెరపై దూసుకుపోతుంది. ఈ సంస్థ నుండి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. సుధీర్ వ్యాఖ్యాతగా జబర్దస్త్, ఢీ తో పాటు పలువురు కమెడియన్స్, సినిమా సెలెబ్రిటీలతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
undefined
కామెడీ స్కిట్స్ తో పాటు, దుమ్ము రేపే డాన్స్ లు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడవచ్చు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో పాటు మరికొందరు కమెడియన్స్ ఈ షోలో సందడి చేస్తున్నారు.
undefined
తాజా ఎపిసోడ్ కోసం ఇటీవల జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన హీరోయిన్ ఇంద్రజ వచ్చారు. అలాగే జయం ఫేమ్ సదా కూడా రావడం జరిగింది.
undefined
అనేక పంచ్ లు, డాన్స్ షోలు, కామెడీ స్కిట్స్ తో సాగిన ఈ ఎపిసోడ్ లో ఢీ జడ్జెస్ పై చేసిన స్కిట్ హైలెట్ గా మారింది. ప్రియమణి, పూర్ణ గా ఇద్దరు అమ్మాయిలు, గణేష్ మాస్టర్ గెటప్ లో ఇమ్మానియేల్ కనిపించారు.
undefined
ఇక ఢీ యాంకర్ ప్రదీప్ గా రామ్ ప్రసాద్ చేయడం జరిగింది. ఢీ ఫైనల్స్ కి చేరిందని ప్రదీప్ గెటప్ లో ఉన్న రామ్ ప్రసాద్ చెప్పగా, అప్పుడే ఫైనల్స్ కి వచ్చేశామా.. ఈ షోని నమ్ముకొని, ప్లాట్స్ కి, హౌసెస్ కి అడ్వాన్సులు ఇచ్చామే అంటూ పూర్ణ, ప్రియమణి గెటప్ లో ఉన్న అమ్మాయిలు అన్నారు.
undefined
గణేష్ మాస్టర్ గెటప్ లో ఉన్న ఇమ్మానియేల్ మాత్రం.. మీరు ఊరుకోండమ్మా.. నేను ఒకడికి నాలుగు లక్షలు, ఒకడికి రెండు లక్షలు ఇవ్వాలి అని, గణేష్ మాస్టర్ పై పంచ్ వేశాడు. ఆ పంచ్ కి షోలో ఉన్న వాళ్ళు అందరూ గట్టిగా నవ్వారు.
undefined
ఢీ షోలో కాంటెస్ట్ చేస్తున్న ఇద్దరు డాన్సర్స్ ఆర్థిక బాధలు తెలుసుకొని గణేష్ మాస్టర్ ఆర్థిక సాయం చేశారు. దానిని ఉద్దేశిస్తూ ఇమ్మానియేల్ పంచ్ వేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది జస్ట్ కామెడీ కోసమే.
undefined
ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ తన సింగింగ్ టాలెంట్ కూడా చూపించారు. ఆమె స్వాతిముత్యం సినిమాలోని ''లాలి లాలి..'' సాంగ్ అద్బుతంగా పాడారు. జులై 25న ప్రసారం కానున్న ఈ షో దుమ్ము రేపనుందని, ప్రోమో ద్వారా అర్థం అవుతుంది.
undefined
click me!