చీరకట్టిన గోవా అందం.. తలలో తెల్ల గులాబీ, గ్రీన్ శారీ ధరించి కట్టిపడేస్తున్న ఇలియానా.. మతిపోగొడుతోందిగా!

First Published Nov 27, 2022, 4:17 PM IST

స్టార్ హీరోయిన్  ఇలియానా (Ileana) గ్లామర్ విందుతో  ఇంటర్నె ట్ ను ఊపేస్తోంది. బోల్డ్ అందాలతోనే కాకుండా.. ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొట్టింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇలియానా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రవితేజ వంటి స్టార్ల సరసన నటించి అగ్రస్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.
 

గ్లామర్ షోలో పూర్తిగా హద్దులు దాటేసినా ఇలియానా.. వరుసగా బికీనీలోనే దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. బోల్డ్ గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది.
 

తాజాగా ఇలియానా పంచుకున్న పిక్స్ లో చీరకట్టులో కట్టిపడేస్తోంది. గ్రీన్ అండ్ పింక్ హాఫ్ శారీలో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. తలలో తెల్ల గులాబీ ధరించి.. అచ్చమైన తెలుగమ్మాయిలా చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఎప్పుడూ బికినీలోనే కనిపించే ఈ బ్యూటీ ట్రెడిషనల్ గా కనిపించాలంటే ‘శారీ, పూలు ఇవ్వడంటూ’ క్యాప్షన్ కూడా పెట్టింది.
 

ముఖ్యంగా ఇలియానా అంటే  గుర్తుకొచ్చేది ఆమె ఫిజిక్. జీరో సైజ్ నడుముతో సౌత్ ఇండస్ట్రీని ఏలిన ఈ బ్యూటీ.. యూత్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇదే క్రేజ్ తో బాలీవుడ్ లోనూ దూసుకుపోవాలని ప్రయత్నించింది. అక్కడా తన సత్తా చాటింది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తూ ఉంది.
 

తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో వెండితెరపై మెరిసింది. పెద్దగా ఈ చిత్రం ఆకట్టుకోకపోవడం.. ఇలియానా అప్పట్లో సన్నగా నాజుగ్గా కనిపించడం.. రీఎంట్రీలో బొద్దుగా మారడం అభిమానులకు పెద్దగా నచ్చలేదు. 2018లో వచ్చిన ఈ చిత్రం తర్వాత ఇలియానా తెలుగులో మరే చిత్రం చేయలేదు.
 

బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫిదా చేస్తోంది. రీసెంట్ గా ‘ది బిగ్ బుల్’లో అభిషేక్ బచ్చన్ సరసన నటించి అలరించింది. ప్రస్తుతం ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ మరియు శ్రీషా గుహ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.

click me!