చిన్న గౌనులో శ్రీముఖి చిలిపి పోజులు... ఫ్రంటూ, బ్యాకూ చూపిస్తూ పరువాలు పరిచయం చేసిన హాట్ యాంకర్!

First Published Sep 22, 2021, 1:56 PM IST

బొద్దుగున్నా కూడా కొందరు ముద్దుగా ఉంటారు. చబ్బీ లుక్ లో కూడా మనసులు దోచే గ్లామర్ కొందరు అమ్మాయిల సొంతం. ఆ కోవకే చెందుతుంది యంగ్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi). 

టాప్ యాంకర్స్ ఒకరిగా ఉన్న శ్రీముఖి బాగానే పాపులారిటీ సంపాదించారు. బిగువైన అందాల ఈ బొద్దుగుమ్మ అంటే పడిసచ్చే బుల్లితెర ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. 

ఆ మాత్రం క్రేజ్ ఆమెకు ఉంది కాబట్టే.. బుల్లితెరపై జెట్ స్పీడ్ తో దూసుకువెళుతున్నారు. పొట్టిబట్టలలో గ్లామర్ షోకి వెనుకాడని సుందరాంగులో శ్రీముఖి ఒకరిగా ఉన్నారు. 

సౌందర్య ఆరాధకులు శ్రీముఖి అందాలు ఆస్వాదిస్తూ సేద తీరుతూ ఉంటారు. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. 

టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. 

బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి పైకి ఎదిగారు. 

ఇక సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. 


మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. 
 


సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. 

తాజాగా మోకాళ్ళు దిగిన పొట్టి ఫ్రాకులో చిలిపి ఫోజులిస్తూ ఫోటో షూట్ చేసిన శ్రీముఖి. చిన్న గౌనులో బొద్దుగుమ్మ శ్రీముఖి అందాలు భలే ముద్దొచ్చేస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 
 

click me!