షారుక్ ఇచ్చిన ఆ బహుమతి ఎప్పుడూ నా పర్స్ లోనే ఉంటుంది... ఆ ఐదు రోజులు తెగ ఎంజాయ్ చేశాం!

First Published Jun 18, 2021, 1:57 PM IST

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ని పొగడ్తలతో ముంచేసింది నటి ప్రియమణి. తాజాగా ఇంటర్వ్యూలో షారుక్ గురించి ఆమె గుక్క తిప్పుకోకుండా మాట్లాడారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రొమోషన్స్ లో పాల్గొన్న ప్రియమణిని షారుక్ గురించి అడుగగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ సూపర్ హిట్. షారుక్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ మూవీలో ప్రియమణి స్పెషల్ సాంగ్ లో కనిపించారు. సూపర్ హిట్ మాస్ సాంగ్ 1234... లో షారుక్, ప్రియమణి కలిసి స్టెప్స్ వేశారు.
undefined
ఈ సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంగతులు తెలియజేశారు ప్రియమణి. పెద్ద స్టార్ అయినా షారుక్ లో కొంచెం కూడా గర్వం ఉండేది కాదట. అందరితో కలివిడిగా ఉంటూ సెట్స్ లో సందడి చేసేవారట.
undefined
ఐదు రోజుల పాటు జరిగిన సాంగ్ షూట్ లో షారుక్, ప్రియమణి చాలా ఎంజాయ్ చేశారట. ఇక షూటింగ్ గ్యాప్ లో స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట షారుక్. జూనియర్ కొరియోగ్రాఫర్స్ నుండి స్టెప్స్ నేర్చుకుంటూ హోటల్ కి కూడా వెళ్లకుండా ఉండిపోయేవారట.
undefined
కాగా ఈ సాంగ్ షూటింగ్ సమయంలో షారుక్ ఐపాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ ఆడారట ప్రియమణి. అప్పుడు షారుక్ ప్రియమణికి మూడు వందల రూపాయలు ఇచ్చారట.
undefined
ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా గుర్తుగా దాచుకున్నాని ప్రియమణి చెప్పారు. అలాగే ఆ మూడు వందలు ఎప్పుడూ తన వాలెట్ లో ఉంటాయట.
undefined
షూటింగ్ జరిగిన ఐదు రోజులు చాలా బాగా గడిచినట్లు ప్రియమణి చెప్పుకొచ్చారు. షారుక్ లాంటి సూపర్ స్టార్ ఇచ్చిన డబ్బులు సెంటిమెంట్ గా దాచుకున్నారట ప్రియమణి.
undefined
ఇక ప్రియమణి కెరీర్ విషయానికి ఆమె వస్తే ఆమె సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ బాషలలో కలిపి ఆరేడు సినిమాలు చేస్తున్నారు.
undefined
అలాగే వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది ప్రియమణి. పరుత్తివీరన్ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి 2017లో వివాహం చేసుకున్నారు.
undefined
click me!