Karthika Deepam: కార్తీక్ కి సలహా ఇచ్చిన హేమచంద్ర.. మోనిత పై కోపంతో రగిలిపోతున్న దీప?

First Published Jan 14, 2023, 7:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో ఏంటి డాక్టర్ బాబు పిలిచారు అనడంతో నీకు వేడి పడదని చెప్పాను కదా దీప మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అనడంతో పిల్లలు పిండి వంటలు అడిగారు డాక్టర్ బాబు అందుకే కాదన లేకపోయాను అనగా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మ అని అంటాడు హేమచంద్ర. ప్రమాదానికి మరింత దగ్గర వెళ్తే ఎలా అని హేమచంద్ర అనడంతో ప్రమాదమని మీరు అనుకుంటున్నారు సంతోషానికి దగ్గరగా వెళుతున్నాను అని నేను అనుకుంటున్నాను అంటుంది దీప. పిల్లలు పట్టుబడుతున్నారు చంద్రమ్మ నేను అత్తయ్య అందరూ చేస్తున్నాము ఒకవేళ కాదు అంటే ఎందుకు అని అడుగుతారు అందుకే కాదనలేక చేస్తున్నాను డాక్టర్ బాబు అని అంటుంది దీప.

ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేయండి నేను కూడా కార్తీక్ అదే విషయం చెబుతున్నాను ఇంకా ఎక్కువ రోజులు ఈ విషయాన్ని దాచొద్దండి అని అంటాడు హేమచంద్ర. అప్పుడు కార్తీక్ నిజం చెప్పేద్దాము అనగా వద్దు డాక్టర్ బాబు అని అంటుంది దీప. మేము చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు దీప అని హేమచంద్ర అనగా నాకు కూడా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని లేదు అన్నయ్య అందరిలాగే నేను నూరేళ్లు బతకాలని ఉంది అని ఏడుస్తూ మాట్లాడుతుంది దీప. నేను బతకడానికి ఒక్క అవకాశం కూడా లేదా డాక్టర్ బాబు అని దీప ఏడుస్తూ అడగగా అప్పుడు కార్తీక్ మోనిత అన్నమాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే వెళ్లి అత్తయ్య వాళ్లకు చెప్పేస్తాను చెప్పండి డాక్టర్ బాబు అని అంటుంది దీప.
 

అప్పుడు పిల్లలు పిలవడంతో దీప అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత సౌందర్య పిల్లలు కలసి దీప కార్తీక్ ను అక్కడికి పిలుస్తారు. ఇప్పుడు కార్తీక్ దీపను దూరంగా ఉండమని చెప్పగా సంతోషానికి హద్దులు పెట్టకండి డాక్టర్ బాబు అంటుంది దీప. ఆ తర్వాత సౌందర్య సీరియస్ అవ్వడంతో కార్తీక్ దీప అక్కడికి వచ్చి భోగి మంటలు వెలిగిస్తారు. ఇంతలో మోనిత వచ్చి బకెట్ నీళ్లతో ఆ భోగి మంటను ఆర్పేస్తుంది. ఇక్కడ నా కడుపు మండుతుంటే మీకు భోగిమంటలు కావాల అనగా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా రాక్షసి అంటుంది సౌందర్య. ఈ భోగి మంటలు ఇవన్నీ నావి ఈ దీప కార్తీక్ పక్కన లేకపోతే నేను భార్యగా ఇవన్నీ చేసేదాన్ని అని అంటుంది.
 

అప్పుడు మోనిత మాటలకు కోపంతో రగిలిపోతూ ఎక్కువ మాట్లాడమంటే ఈ భోగి మంటలలో నిన్ను తగలబెట్టేస్తాను అని మోనిత జుట్టు పట్టుకుంటుంది. అప్పుడు కార్తీక్ బలవంతంగా దీపను పక్కకు పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు ఈ మోనిత చంపేస్తాను అనడంతో మోనిత నవ్వుకుంటూ నవ్వు నన్ను చంపేస్తావా అంటూ అసలు నిజం చెప్పబోతుండగా కార్తీక్ సీరియస్ అయ్యి ఒక్క మాట మాట్లాడావంటే దీప అన్నమాట నీ నిజం చేస్తాను ఇకనుంచి వెళ్లిపోనడంతో మోనిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పిల్లలు అలిగే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హేమచంద్ర కార్తీక్ అలా నడుచుకుంటూ వెళుతూ మోనిత మంచి పని చేసింది లేకపోతే దీపను హాస్పిటల్ వచ్చేది అని అంటాడు.
 

అప్పుడు వాళ్ళిద్దరూ దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే కార్తీక్ ఇలా రా అని పిలుస్తుంది మోనిత.. అప్పుడు అక్కడికి వెళ్లడంతో ఏంటి కార్తీక్ థాంక్స్ చెప్తావ్ అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు అనగానే నీకు ఎందుకు చెప్పాలి థాంక్స్ అని అంటాడు కార్తీక్. నేను ఎంత పెద్ద సహాయం చేశాను అన్నది నీకు తెలుసు దీప ఉన్న పరిస్థితులలో భోగిమంట దగ్గరికి వెళ్తే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది అని అంటుంది మోనిత. అప్పుడు మోనిత నాటకాలు ఆడుతూ దీపకు ప్రమాదం జరగకూడదని తెలిసే నన్ను తిట్టినా పర్వాలేదు అనుకోని అలా చేశాను అని అంటుంది. ఇప్పుడు మౌనిత గుండె మార్పిడి గురించి మాట్లాడుతూ కార్తీక్ ని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య, దీప జరిగిన విషయాన్ని తలచుకొని రగిలిపోతూ ఉంటారు.
 

ఎందుకు అది మిమ్మల్ని పిశాచిలా వెంటాడుతోంది అని అంటుంది. ఈ మోనిత మీకు ఎక్కడ తగిలింది దీప అదేమో మిమ్మల్ని రాకుండా అడ్డుపడింది అంటుంది.  మీరు చూస్తే ఏమి చెప్పడం లేదు అనగా అదేం లేదు అత్తయ్య అని అంటుంది దీప. అత్తయ్య పదేపదే అదే మాటలు అడుగుతున్నారు ఇప్పుడు ఎలా చెప్పి తప్పించుకోవాలి అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి నానమ్మ ఆ మోనిత పీడ విరగడవ్వాలి కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వండి అని అంటుంది. ఇప్పుడు భోగి మంటలు ఆరిపేసింది మనల్ని పండుగ కూడా చేసుకొనివ్వదు అనగా దాన్ని ఆల్రెడీ పోలీసులకు పట్టించాను కానీ ఎలా బయటికి వచ్చిందో వచ్చేసింది అంటుంది సౌందర్య.

దాని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా దాన్ని ఇటువైపు రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది దీప. మరొకవైపు హేమచంద్ర కూర్చుని ఉండగా అక్కడ ఎవరు రావడంతో మోనిత ఏమంటోంది అనగా అసలు విషయం చెప్పడంతో హేమచంద్ర ఆశ్చర్యపోతాడు. పొద్దున అదే మాట చెబితే ఏదో ఊరికే చెబుతుందిలే అనుకున్నాను ఇప్పుడు మళ్లీ అదే మాట చెబుతోంది కావాలంటే ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తాను అంటుంది అని అంటాడు కార్తీక్. అప్పుడు వాళ్ళిద్దరూ మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మోనిత అన్నంత పనిచేస్తుంది కార్తీక్ ఎందుకంటే పెళ్లి అయినా కూడా నిన్ను విడిచిపెట్టలేదు కదా ఆ విషయంలో మోనితను ఎంతకైనా తెగిస్తుందని చెప్పవచ్చు అంటాడు హేమచంద్ర.

click me!