క్యాన్సర్ నుండి కంప్లీట్ గా బయటపడ్డ హంసానందిని.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

First Published Jan 8, 2023, 7:18 AM IST

ఎట్టకేలకు  క్యాన్సర్ తో పోరాడి.. విజయం సాధించింది హంసనందిని. కంప్లీట్ గా క్యాన్సర్ ను జయించి సరికొత్తగా ఆడియన్స్ కు కనిపించింది. ఈక్రమంలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

చాలా కాలం మహమ్మారితో  యుద్దం చేసింది  టాలీవుడ్ ఐటమ్ బాంబ్  హంస నందిని. క్యాన్సర్ వల్ల ఎంతో బాధను అనుభవించింది. చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఆమధ్య కోలుకుని షూటింగ్స్ కు కూడా హాజరయ్యింది. ఈక్రమంలో పూర్తిగా కోలుకుని బయట ప్రపంచంలో స్వేచ్చగా గాలీపీల్చుకుంటున్న హంసనందిని తన సంతోషాన్ని ఓ పోస్ట్ రూపంలో తెలియజేసింది. 
 

తన వెన్నంటే ఉంటూ.. తన కష్టంలో సపోర్ట్ గానిలిచిన ఫ్యాన్స్ కు.. ఫాలోవర్స్ కు ఒక్క సింగిల్ వార్డ్ లో పెద్ద థ్యాంక్స్ చెప్పేసింది హంసనందిని. ప్రస్తుతం బ్యాంకాల్ లో ఉన్న ఈ బ్యూటీ.. అక్కడ రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటోను శేర్ చేసింది. వెల్కం బ్యాక్ అంటూ రాసిన ప్లేను కూడా ఈ ఫోటోలో కనిపిస్తుంది.
 

టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని.

టాలీవుడ్  ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని సడెన్ గా  బ్రెస్ట్ కేన్సర్ బారిన పడింది. 2022 ఏడాది ఆరంభంలో తను ఈ మహమ్మారి కోరల్లో చిక్కకున్నట్టు  ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. అప్పడప్పుడు అప్ డేట్ ను అందిస్తూ వచ్చింది.  చివరకు క్యాన్సర్ ను జయించింది. 
 

ట్రీట్మెంట్ తో పాటు ఆత్మవిశ్వసం తోడై... క్యాన్సర్ ను  విజయవంతంగా అధిగమించిన హంసా నందిని తిరిగి సినిమాల్లో నటించడం కూడా మొదలు పెట్టింది. అయితే ఆమెకు వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. 2021 డిసెంబర్ లో విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది హంస. 

లాస్ట్ ఇయర్ చివర్లోనే చాలా వరకూ క్యాన్సర్ నుంచి కోలుకుంది హంసానందిని.. సినిమా షూటింగ్స్ కు కూడా హాజరయ్యింది. అంతే కాదు సెట్ లో తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది బ్యూటీ. ఆతరువాత న్యూ ఇయర్ కొత్త జీవితాన్ని ఆరంభించింది. లాస్ట్ ఇయర్ ఆరంభంలో క్యాన్సర్ తనను పీడిస్తే.. ఈఏడాది ఆరంభంతో రిలీఫ్ పొందింది హంస. 
 

Hamsa nandini

తన బర్త్ డే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది హంసా నందిని.మూవీ సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేశా అని హంసా పోస్ట్ పెట్టింది. 

ఇక వంశ పారంపర్యం వల్ల హంస నందినికి క్యాన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఆమో  తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించింది. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు వెల్లడించింది హంస. 18 ఏళ్ల క్రితం తన తల్లిని కేన్సర్ పొట్టన పెట్టుకుందంటూ ప్రకటించిన హంసా.. ధైర్యంగా క్యాన్సర్ గా క్యాన్సన్ ను జయించింది. 

click me!