శ్రీముఖి ఫోన్ నంబర్ కావాలా?... పబ్లిక్ గా చెప్పేసింది, మీరు ఫోన్ చేయడమే ఆలస్యం!

First Published May 26, 2021, 9:22 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి చేసిన పని అందరికీ షాక్ గురి చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు బ్యాన్ అయితే మీతో ఎలా మాట్లాడాలని అడిగిన ఫ్యాన్ కి ఫోన్ నంబర్ ఇచ్చేసింది. 

కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ బ్యాన్ కానున్నాయని ప్రచారం జరుగుతుంది. పరిస్థితులను అదుపులోకి తేవడానికి, భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సదరు వార్తల సారాంశం.
undefined
నిద్రలేస్తే సోషల్ మీడియాలో గడిపేసే కోట్ల మంది ప్రజలు ఈ వార్తలతో షాక్ తిన్నారు. చివరకు సినిమా ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా మాధ్యమాలు బ్యాన్ కానున్నాయని ప్రచారం జరిగింది.
undefined
దీనితో శ్రీముఖి తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్నారు. తమ అభిమాన యాంకర్ సోషల్ మీడియాలోకి అద్నుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ తమ సందేహాలు తీర్చుకునే పనిలో పడ్డారు.
undefined
శ్రీముఖిని పెళ్లి, ప్రేమ వంటి విషయాలపై కూడా ప్రశ్నలు వేశారు. ఎవరు ఏమి అడిగినా సావధానంగా సమాధానం చెప్పింది శ్రీముఖి. అయితే కొన్ని ప్రశ్నలకు ఆమె తన మార్కు కామెడీ జోడించి సమాధానం చెప్పింది.
undefined
సోషల్ మీడియా మాధ్యమాలు బ్యాన్ అయితే మీతో ఎలా మాట్లాడాలి అక్క, మాట్లాడుకోవడానికి ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వమని ఓ ఫ్యాన్ అడిగారు. దానికి శ్రీముఖి ఇదిగో నా ఫోన్ నంబర్ అంటూ... 9848032919 చెప్పేసింది.
undefined
అలా పర్సనల్ నంబర్ పబ్లిక్ గా చెప్పడానికి శ్రీముఖి అంత ధైర్యమా అనుకుంటే మోసపోయినట్లే.. ఆ ఫోన్ నంబర్ ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన లవర్ కి చెప్పేది. ఒక్కడు సినిమాలో కామెడీ సీన్ కోసం వాడిన ఫోన్ నంబర్ ని ఫ్యాన్ కి ఇచ్చి సెటైర్ వేసింది శ్రీముఖి.
undefined
కాగా ఇదే చాట్ లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంటే క్రష్ అంటూ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉండగా ఆమె కన్ను దీపికా భర్తపై పడింది. ఇక శ్రీముఖి హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదల కావాల్సి ఉంది.
undefined
click me!