నాకు లైఫ్‌ ఇచ్చారంటూ రామ్‌ పెదనాన్న కాళ్లపై పడ్డ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌..స్టేజ్‌పైనే కన్నీళ్లు

First Published Jan 13, 2021, 8:31 AM IST

త్రివిక్రమ్‌ స్టార్‌ డైరెక్టర్. గతేడాది `అల వైకుంఠపురములో` తో నాన్‌ బాహుబలి రికార్డ్‌లను కొల్లగొట్టిన డైరెక్టర్. తాజాగా ఆయన ఓ నిర్మాత కాళ్లపై పడ్డారు. ఎనర్జిటిక్‌ హీరో  రామ్‌ పెద్దనాన్నకి పాదాభివందనం చేశారు. అంతేకాదు ఎమోషనల్‌ అయ్యారు. తనకు లైఫ్‌ ఇచ్చారంటూ ఏడ్చేశారు. ఈ అరుదైన సన్నివేశం `రెడ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగింది. 
 

రామ్‌ హీరోగా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో `రెడ్‌` చిత్రం రూపొందింది. నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రామ్‌ పెదనాన్న స్రవంతి రవి కిషోర్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
undefined
ఈ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రామ్‌పై, దర్శకుడు కిషోర్‌ తిరుమలపై ప్రశంసలు కురిపించారు. `దేవదాస్‌` సినిమాని చూసినప్పుడు లైవ్‌ వైర్‌ లాంటి వారని చెప్పారట. ఆ తర్వాత ఎనర్జిటిక్‌ స్టార్ అనే పేరు ఇచ్చారని గుర్తు చేశారు.
undefined
దర్శకుడు కిషోర్‌ తిరుమలపై ఆయన ప్రశంసలు కురిపించారు. నిబద్దత, పద్ధతి, పొదుపు తెలిసిన దర్శకుడు అని, సిన్సియర్‌ దర్శకుడు అని, నీలాంటి వాళ్లు పరిశ్రమకి అవసరం అని, సినిమాలు తీయాలని, పెద్ద దర్శకుడు కావాలన్నారు.
undefined
ఈ సందర్భంగా రామ్‌ పెదనాన్న, నిర్మాత స్రవంతి రవికిషోర్‌పై త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ అయ్యారు. తనకు ఎవ్వరూ సినిమాలు ఇవ్వని టైమ్‌లో పిలిపించి లైఫ్‌ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆయన కాళ్లపై పడ్డారు.
undefined
త్రివిక్రమ్‌ చెబుతూ, `స్వయంవరం` సినిమా తర్వాత నాకు ఎవరూ సినిమాలివ్వలేదు. దీంతో నేను భీమవరం వెళ్లి క్రికెట్‌ ఆడుకుంటున్నాను ఆ సమయంలో రవికిషోర్‌గారు పిలిపించి `నువ్వే కావాలి`కి డైలాగులు రాయించారు. అలాగే `నువ్వు నాకు నచ్చావు` సినిమాకి డైలాగులు రాసినప్పుడు డైలాగులు చదివి రాత్రి 12 గంటలకు ఫోన్‌ చేసి మరీ ప్రశంసించారని ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.
undefined
`డైలాగులు, కథ విలువ తెలిసిన రసికుడికి నేను రాసి వినిపించే అవకాశం రావడం నా అదృష్టం. అనుభవించే సామర్థ్యం ఉన్న ఆయనకు రాసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఆయన కో డైరెక్టర్‌లాగా షేడ్యూల్‌ వేసేందుకు ఇష్టపడతారని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తప్పులు దిద్దుతారని, షూటింగ్‌లో ఏ రోజు ఎక్కడ షూటింగ్‌ జరుగుతుంది, ఏ సీన్‌ ఎక్కడ తీస్తున్నారో చెప్పగలిగే టాలెంట్‌ వారిది. స్క్రిప్ట్ ని మొదటి నుంచి చివరి వరకు చదువుతారని, రామానాయుడు తర్వాత రవికిషోర్‌ అలా చేస్తారని, అలాంటి గొప్ప వ్యక్తులతో కెరీర్‌ ప్రారంభంలోనే పనిచేసే అదృష్టం నాకు దక్కింద`న్నారు.
undefined
రామజోగయ్య శాస్త్రి లాంటి అద్బుతమైన రైటర్‌ని పరిచయం చేశారని, ఆయన రాసిన పాట విని ఆనాదే మరో అద్భుతమైన లిరిక్‌ రైటర్‌ దొరికారని చెప్పాడని త్రివిక్రమ్‌ గుర్తు చేశారు. పాటలంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రవికిషోర్‌ని తాను పెద్దన్నయ్యలాగా భావిస్తానని,
undefined
వారి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. `నువ్వే కావాలి`, `నువ్వే నువ్వే`, `నువ్వు నాకు నచ్చావు` ఇలా నాలుగు సినిమాలకు పనిచేశానని చెప్పారు. `నువ్వే కావాలి..` ఈ సీన్‌ బాలేదని, ఇద్దరం కొట్టుకున్నామని, నన్ను తరిమి కొట్టాడని, ఆ తర్వాత నన్ను పిలిపించి ఆయనే రైటర్‌ అని ప్రూవ్‌ చేసిన వ్యక్తి రవికిషోర్‌ అని, అలాంటి వ్యక్తికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, కాళ్లపై పడ్డారు. ఈ సన్నివేశం `రెడ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.
undefined
ఈ సందర్భంగా హీరో రామ్‌ మాట్లాడుతూ, రైటర్స్ పై గౌరవం రావడానికి త్రివిక్రమ్‌ గారే అని, ఆయన నాకు రైటర్స్ విలువేంటో తెలిసేలా చేశారని, ఆయన తనకు స్ఫూర్తి అన్నారు. అభిమానుల ఎనర్జీనే నాకు ఎనర్జీ అన్నారు.
undefined
click me!