పెళ్ళికి ముందే తల్లిని అయితే ఏం చేస్తావ్... స్టార్ డైరెక్టర్ కి కూతురు సూటి ప్రశ్న!

First Published Jun 21, 2021, 3:47 PM IST

కాలంతో పాటు సాంప్రదాయాలు, ఆలోచనా విధానాలు మారిపోతూ ఉంటాయి. కట్టు, బట్ట, తిండి, బంధాలు, ఎమోషన్స్ అన్నింటిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రుల రిలేషన్స్. ఆలోచనా తీరులో పెనుమార్పులు వచ్చాయి. ఒకప్పుడు సెక్స్ అనే పదాన్ని వయసులో ఉన్న అబ్బాయి ముందే పలకడానికి ఇష్టపడని పేరెంట్స్.. ఇప్పుడు కూతురుతో కూడా డిస్కస్ చేస్తున్నారు. 
 

తాజాగా సెక్స్, రిలేషన్స్. లవ్, అఫైర్స్ వంటి బోల్డ్ విషయాలపై తండ్రి కూతుళ్ళ మధ్య మెచ్యూర్డ్ సంభాషణ జరిగింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు అలియా చాలా కాలంగా ప్రియుడు షేన్ గ్రెగోయ్ తో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. అనురాగ్ కశ్యప్, అలియా తన రిలేషన్ విషయంలో తండ్రి స్పందన అడిగి తెలుసుకుంది.
undefined
నా బాయ్ ఫ్రెండ్ షేన్ ని మీరు ఇష్టపడుతున్నారా? అని మొదటి ప్రశ్న అడుగగా.. షేన్ చాలా మంచివాడు. ఎవరితో స్నేహం చేయాలనే విషయంపై అతనికి మంచి అవగాహన ఉంది. అలాగే అబ్బాయిలతో నువ్వు జాగ్రత్తగా ఉంటావనే ధైర్యం నాకు ఉంది.. అని అనురాగ్ సమాధానం చెప్పాడు.
undefined
ఒక అమ్మాయి నైట్ బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్లడంపై మీ ఉద్దేశం ఏమిటీ? అని అడుగగా... అలా చేయడం తప్పేమీ కాదు. కాకపోతే మన దేశంలో పేరెంట్స్ దీన్ని అసలు సహించరు. అయితే పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ తరం పిల్లలు అణచివేతను అంగీకరించరు. కాబట్టి మన భయాల్ని, అభిప్రాయాలను వాళ్లపై రుద్దకూడదు... అన్నాడు.
undefined
పెళ్లికి ముందే సెక్స్, ప్రెగ్నెన్సీ వంటి విషయాలను ఎలా చూస్తారని అడుగగా.. గతంలో సెక్స్‌ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సెక్స్ గురించి రహస్యంగా చాటుమాటుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్‌. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను నీకు వివరిస్తాను. ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తాను.. అంటూ సమాధానం చెప్పాడు.
undefined
ఇక పెళ్లికి ముందే గర్బం దాల్చాను అని చెబితే.. నీవు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటాను.. నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. మద్దతుగా నిలుస్తాను. కానీ దాని వలన తలెత్తే సమస్యలు ఏవైనా నువ్వు పరిష్కరించుకోవాలి..  అని చెప్పుకొచ్చారు.
undefined
ఫాదర్, డాటర్ మధ్య జరిగిన ఇలాంటి సంభాషణ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీనితో ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడం జరిగింది.
undefined
click me!