Guppedantha Manasu: వసుధార చీర కట్టుకోలేదని ఆనందంతో దేవయాని.. జగతి తరపున వసుధారకి సారీ చెప్పిన రిషి!

First Published Oct 17, 2022, 9:24 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జగతి మహీంద్రలు వాళ్ళ గదిలో కూర్చుని ఉంటారు. అప్పుడు మహేంద్ర జగతితో, అయినా నువ్వు వసుధారని కొట్టడం తప్పు జగతి. ఎప్పుడూ సహనంగా ఓర్పుతో ఉండే నువ్వు ఒకరి మీద చేయి చేసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు. దానికి జగతి, నేను చాలా కంట్రోల్ చేసుకుందామనుకున్నాను మహేంద్ర కానీ మనకు ఇష్టమైన వ్యక్తి మనం చెప్పే పనిని చేయకపోతే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసా నా పరిస్థితి అలాగే ఉన్నది అక్కడ రిషి పరిస్థితి అలాగే ఉన్నది. అయినా నేను వసుధారని కొట్టాను అని బాధపడడం లేదు రిషి బాధపడుతున్నాడు అని బాధపడుతున్నాను. 
 

అయినా వసుధార తెలివైనది అనుకున్నాను కానీ తనకి మద్య మొండితనం చాలా పెరిగిపోతుంది. ఆ మొండితనానికి ఫలితం ఒక జీవితం,రిషి మనసు. ఇది అర్థం చేసుకొనే లోగే వసుకి తీరని నష్టం జరుగుతాదేమో అని భయంగా ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మహేంద్ర, రిషి ఫోటో చూస్తూ ఇదంతా నా వల్లే వచ్చింది కదా గురుదక్షిణ అడగకుండా ఉండాల్సింది నన్ను క్షమించు రిషి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి వసుధారలు బయట గార్డెన్లో బెంచ్ మీద కూర్చుని మౌనంగా ఉంటారు.
 

 ఇద్దరు మాట్లాడుకోరు అప్పుడు వసు రిషితో, సర్ ఒక చీర వల్ల మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ను అంచినా వేయగలమా అని అడగగా, నేను నిన్ను ఆ  ప్రశ్న అడగాలి వసుధార నేను నిన్ను అందుకే తీసుకువచ్చాను అని అంటాడు. దానికి వసుధార, మరి ఇంత సేపు మౌనంగా ఉన్నారు అని నేనే మాట్లాడాను సార్. అయినా చీర కట్టుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కట్టుకోకపోతే ప్రేమ లేనట్టు అనుకుంటే ఎలా సారు ఎవరి అభిప్రాయాలు వారివి. అయినా చీర కట్టుకున్న కట్టుకోకపోయినా మనిద్దరి మధ్య బంధం మారదు కదా సార్ అని అనగా, అభిప్రాయాలు వేరువేరుగా ఉంటే బంధం ఒకటి ఎలా అవుతుంది వసుధార అని రిషి అడుగుతాడు.
 

 దానికి వసు, ప్రేమ సార్ అయినా చీర ఇచ్చే ఆలోచన మీకు రావడం ఏంటి సార్ నాకు తెలిసి ఇది మీ ఆలోచన కాదు అని అనగా రిషి, దేవయాని తనకి చీరనిచ్చి వసుధారకు కట్టమన్న సంగతి గుర్తు చేసుకుంటూ అవును ఇది దేవయాని పెద్దమ్మ ఇచ్చారు అని అంటాడు. అప్పుడు రిషి, మరి జగతి మేడం కొట్టడం గురించి బాధపడి ఉంటావు కదా అని అడగగా, లేదు సార్ నన్ను కొట్టే హక్కు ఆవిడకి మాత్రమే ఉన్నది. నేను చేసిన పని మేడంకి తప్ప అయి ఉండొచ్చు అందుకే కొట్టుంటారు దానికి నేనేం బాధపడడం లేదు సార్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంది.
 

అప్పుడు రిషి జగతి మేడం తరఫున సారీ అని చెప్తాడు. మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు సార్ మనం ప్రేమించిన వ్యక్తి ఏమైనా చేస్తే వాళ్ళకి బదులుగా మనం క్షమాపణ చెప్తాము అంటే మీరు జగతి మేడం ని..అని మాట పూర్తి కాకముందే ఇంక ఆపు వసుధార అని రిషి అంటాడు. అలా కాదు సార్ నన్ను చెప్పనివ్వండి మీరు క్షమాపణ చెప్తున్నారు అంటే ప్రేమ ఉన్నట్టే కదా అని అనగా రిషికి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు, మారుస్తాను సార్ మిమ్మల్ని అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవయాని సోఫాలో కూర్చుని ధరణితో, అయినా ధరణి మనుషులు ఎందుకు ఇంతలా తయారవుతున్నారు మానవత్వం అనేది లేదా ఏంటో ఈ పాడులోకం అని అంటుంది. 
 

దానికి ధరణి, రాక్షసులే మానవత్వం గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా ఉన్నది అని అనుకుంటుంది. అయినా మా అత్తగారి చీర వసుధార కి ఇస్తే కట్టుకోకపోవడానికి తనకి ఇప్పుడు ఏం నొప్పి వచ్చిందట. పాపం రిషి ఎంత బాధపడి ఉంటాడో. అయినా ఈ చీర నీ మీదకు కూడా బానే ఉంది అనుకో అది వేరే విషయం అని అనగా ఎక్కడో తుఫాను వచ్చేసేలా ఉన్నది అని ధరణి అనుకుంటుంది. అయినా జగతి చేయి చేసుకోవడమేంటి ఇప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటారు. రిషి గురించి నేను చూసుకుంటాను కానీ కొంచెం జగతి,మహీంద్రల మీద ఒక కన్నేసి ఉంచు. నేను చెప్తే నువ్వు చేస్తావు లే అని అంటుంది దేవయాని. 
 

అప్పుడు ధరణి మనసులో తెలివైన దానివే అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో రిషి, వసుధారని కార్లో వాళ్ళ ఇంటికి దింపుతాడు.అప్పుడు వసుధార వెళుతూ ఉండగా రిషి బాయ్ చెప్పమని అనగా వసు కార్ దగ్గరికి వచ్చి కార్ తాళాలు తీసుకొని లోపలికి వెళుతుంది. తాలాలు ఎందుకు తీసుకెళ్లిపోయావు అని అడగగా లోపలికి రండి సార్ అని వసు అంటుంది. అప్పుడు రిషి ఫోన్ చేసి పెద్దమ్మ నేను రేపు ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత వసు మంచినీళ్లు ఇస్తుంది. ఎందుకో తెలియదు నీ రూంలోకి వస్తే మనసు బాగుంటుంది అని అనగా మనకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మనసు అలాగే ఉంటుంది సార్.
 

 నేను కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు, కాలేజీకి వచ్చినప్పుడు మనుషులాగే ఉంటుంది అని అంటుంది. అప్పుడు రిషి వసుధార చేయి పట్టుకొని నేను నిన్ను ఒకటి అడుగుతాను వసుధారా చెప్పు నీకు జీవితంలో అందరి కన్నా ఏది ఎక్కువ?నేనా జగతి మేడం ఆ అని అనగా జగతి మేడం సార్ అని వసు చెప్తుంది. దానికి రిషి ఆశ్చర్యపోయి మరి నేను నీకు ఏమీ కానా అని అడగగా మీరు నా జీవితం మీరు నేను వేర్వేరు అని నేను అనుకోను సార్.నా జీవితం మీది మీ జీవితం నాది అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!