Karthika Deepam: ఒక్కటైన సౌందర్య కుటుంబం.. శౌర్య,హిమను చూసి ఎమోషనల్ అయిన దీప?

First Published Jan 10, 2023, 8:06 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో హిమ, సౌర్య దగ్గర ఒక దొంగ డబ్బులు తీసుకుని పారిపోతూ ఉండగా అప్పుడు వాళ్ళు వెళ్లి అతని పట్టుకోవడంతో హిమ సౌర్యని దూరంగా నెట్టేస్తాడు. అప్పుడు కార్తీక్ వచ్చి హిమ, సౌర్యని పట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ ని చూసి హిమ సౌర్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఎమోషనల్ అవుతారు. అప్పుడు వారి ముగ్గురు ఒకటి వైపు ఒకరు అలాగే ఎమోషనల్ గా చూసుకుంటూ ఉండగా అప్పుడు కార్తీక్ శౌర్య,హిమను దగ్గరికి తీసుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హిమ డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మీకోసం మేము ఎంతలా వెతుకుతున్నామో తెలుసా చూసావా సౌర్య ఆరోజు నేను చెప్తే వినలేదు కదా వచ్చాడు చూడు.
 

నాన్న అనడంతో అప్పుడు సౌర్య ఇక్కడే ఉండి మా దగ్గరికి ఎందుకు రాలేదు నాన్న, నీకోసం ఎంతలా వెతికానో మా మీద కోపం వచ్చిందా మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది శౌర్య. అయినా అమ్మ ఎలా ఊరుకుంది మమ్మల్ని చూడకుండా అమ్మ ఎలా ఉంది అని అంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఆరోజు హిమ చూసింది అంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు అనుమానం వస్తోంది. నన్ను కూడా చాలాసార్లు చూసి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు కదా అని అంటుంది శౌర్య. అమ్మ ఎక్కడ నాన్న అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి ప్లీజ్ నాన్న అంటాడు.
 

మీరు అమ్మ దగ్గరికి వెళ్లడం కాదు మీరు ఇంటికి వెళ్ళండి నేను అమ్మని మీ దగ్గరికి తీసుకుని వస్తాను అని కార్తీక్ తప్పించుకునే ప్రయత్నం చేయగా హిమ,సౌర్య కార్తీక్ మాటలు నమ్మరు. మేము నమ్మము డాడీ మీరు మళ్ళీ ఎక్కడికో చోటికి వెళ్ళిపోతారు అందుకే మమ్మల్ని పిలుచుకొని వెళ్ళు అని కార్తీక్ ని బలవంతం పెడతారు. అప్పుడు కార్తీక్ చేసేదేమీ లేక హిమ, సౌర్య దీప దగ్గరికి తీసుకొని వెళ్లడానికి సిద్ధపడతాడు. మరొకవైపు సౌందర్య దీప వస్తుండగా సౌందర్య దీప చేయి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఏంటి అత్తయ్య చెయ్యి వదిలితే పారిపోతున్నాను అనుకుంటున్నారా అనగా లేదే నాకు ఇదంతా కలగా ఉన్నట్టుంది అని అంటుంది సౌందర్య. ఈ గుడ్ న్యూస్ మీ మామయ్యకు చెబుదాము అంటే నువ్వు ఇలా చెప్పే సగం సగం న్యూస్ ఆయనకు చెప్తే ఆయన ముందే హార్ట్ పేషంట్ ఆయన గుండె ఆగిపోతుంది అని అంటుంది.
 

 అసలు మీరు ఎక్కడ ఉన్నారు నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు అనడంతో పిలుచుకొని వెళ్తాను కానీ అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అని అంటుంది దీప. మరొక వైపు శౌర్య, హిమ కార్తీక్ అటుగా వెళుతుండగా ఇంతలో సౌందర్య దీప కూడా ఎదురుపడతారు. అందరూ ఒక చోట కలుసుకోవడంతో ఒకరిని చూసి ఒకరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారమ్మా డాడీ ని అడిగితే దగ్గరికి వెళ్ళాక చెప్తానని అన్నారు నువ్వైనా చెప్పమ్మా అని అంటారు సౌర్య,హిమ. మా అందరిదీ అదే ప్రశ్న ఎందుకు మీరు మా దగ్గరికి రాలేదు అని అనడంతో దీప కార్తిక్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.
 

అప్పుడు కార్తీక్ దీపం వైపు చూస్తూ నువ్వు అనుకున్నదే చేసావ్ దీప అమ్మ వాళ్ళతో కలుపుతాను అన్నావు అలాగే కలిపావు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సౌందర్య దీప ఏమి అడిగినా చెప్పడం లేదు పిల్లలకు కూడా కనిపించకుండా నన్ను దూరంగా తీసుకువచ్చింది అనడంతో అవునా అమ్మ మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని అడగడంతో లేదమ్మా అని పిల్లలను హత్తుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప. మీరు ప్రమాదంలో చనిపోయారు అనుకోని ఇన్ని రోజులు మేము చాలా బాధపడ్డాము కానీ ఉన్నారని తెలిసి కూడా మాకు ఎందుకు ఈ బాధ ఎందుకు మమ్మల్ని ఏడిపించారు అని నిలదీస్తుంది సౌందర్య. ఎందుకు మీ మనసు అంత కఠినంగా మారిపోయింది అనడంతో దీప కార్తిక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు.

సరే అమ్మ మీరు వెళ్ళండి నేను దీపని పిలుచుకొని ఇంటికి వచ్చాను వివరంగా చెప్తాను అనడంతో పిల్లలు ఇద్దరు దీపను గట్టిగా పట్టుకుంటారు. అమ్మ నాన్నలను వదలొద్దు నానమ్మ వదిలితే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని అంటారు. వాళ్ల బాధ చూడండి రా తల్లిదండ్రులు ఉండి కూడా లేనట్టు బతకాల్సిన కర్మ వాళ్లకు ఏంటి అని అంటుంది సౌందర్య. ఇప్పుడు మీరు కనిపించారు అన్న సంతోషం కంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న భయం ఎక్కువగా ఉంది అని అంటుంది సౌందర్య. అప్పుడు దీప భయపడాల్సింది ఏమీ లేదు అనడంతో అయితే ఒక్కసారి మా స్థానంలో ఉండి మీరే ఊహించుకోండి మేము ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించి ఉంటామో అని అంటుంది సౌందర్య. 
 

మీరు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఈరోజు నాకు తెలియాలి. మమ్మల్ని మీ ఇంటి దగ్గరికి పిల్చుకొని వెళ్లండి అని అంటుంది సౌందర్య. మీరు తప్పించుకొని వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది సౌందర్య. అప్పుడు వాళ్ళిద్దర్నీ బలవంతంగా చేతులు పట్టుకుని అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తుంది సౌందర్య. మరొకవైపు కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్లిన మోనిత ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు బయట వెయిట్ చేద్దామా వద్దులే అనుకోని ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆకలి అవుతోంది అనుకొని దోసి పిండి ఉంది, దోశలు వేసుకుని తిందాము అనుకొని దోసలు పోసుకుంటూ ఉంటుంది మోనిత. ఇంతలోనే కార్తీక్ సౌందర్యని ఆ ఇంటి దగ్గరికి పిలుచుకొని రావడంతో ఈ ఇంటికి ఆల్రెడీ నేను వచ్చాను అని అంటుంది సౌందర్య.

నువ్వు అంజి వచ్చిన విషయం మాకు తెలుసు మమ్మీ అని కార్తీక్ అనడంతో, మమ్మల్ని చూసి ఇంటికి తాళం వేసి తప్పించుకుని తిరుగుతున్నారన్నమాట అని అంటుంది సౌందర్య. అసలు ఏం చేస్తున్నారు నన్ను చూసి దాకోవాల్సిన అవసరం మీకు ఏముంది అని అంటుంది సౌందర్య. అప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్తారు. మోనితను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వగా ఫ్యామిలీ అందరిని ఒక చోట చూసి మోనిత కూడా షాక్ అవుతుంది. అప్పుడు సౌందర్య నా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారు నీకు తెలుసు కదా ఎందుకే నాకు అబద్ధం చెప్పావు నా కొడుకు కోడలు ఇంటికి రాకపోవడానికి కూడా కారణం నువ్వే కదా అని అంటుంది.

click me!