కథ స్ట్రాంగ్ గా ఉంటే చాలు.. కంటెంట్ ఉంటే ఖర్చుతో పనిలేదు..లాభాలు అవే వస్తాయి అని టాలీవుడ్ లో బలగం లాంటి కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక ఇఫ్పుడు బాలీవుడ్ లో కూడా ఈ టైప్ సినిమాలకు ఆధరణ స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ సినినిమాలు ఎలాగో నడుస్తాయి.
మధ్యలో ఇలాంటి సినిమాలు పడితేనే ప్రేక్షకులకు కాస్త కొత్తదనం అందుతుంది. ఆ విషయాన్ని 'క్రేజీ' సినిమా ప్రూవ్ చేసింది.'క్రేజీ' సినిమా రిలీజ్ అవ్వగానే మొదటి ఆరు రోజుల్లోనే రూ.6.50 కోట్లు వసూలు చేసింది. సినిమా అంటేనే వీకెండ్ భారీ గా వీక్ డేస్ లో తక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. కాని ఈసినిమాకు వీక్ డేస్‌లో కూడా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గట్లేదు.
ఈమూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇంకా 20 కొత్త సిటీల్లో స్క్రీన్స్ పెంచారు. ప్రస్తుతం సినిమా చూస్తున్న జోరు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఇంకో రూ.15-18 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. ప్రిరిలీజ్ బిజినెస్ 15 కోట్లతో పాటు.. టోటల్ గా 30కోట్లకుపైగా కలెక్షన్ టార్గెట్ గా క్రేజీ మూవీ దూసుకుపోతుంది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కు డిజాస్టర్ మూవీ, బాలకృష్ణతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?