జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

Published : Mar 09, 2025, 04:37 PM IST

Jr NTR Devara Mania Begins in Japan: గెడ్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర దండోరా ఇంకా పూర్తవ్వలేదు. టార్గెట్ కాస్త పెద్దగా ఉంది. ఇండియా దాటి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు తారక్. ఇప్పటికే జపాన్ లో దేవర మ్యానియా స్టార్ట్ అయ్యింది.   

PREV
14
జపాన్ లో మొదలైన దేవర దండోర, టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఎన్టీఆర్

Jr NTR Devara Mania Begins in Japan: ఆర్ఆర్ఆర్ తో అద్భుతం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. చాలా గ్యాప్ తరువాత ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమా దేవర. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ జోడీగా దర్శకుడు కొరటాల శివ భారీ స్థాయిలో  తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంచనాలుపెంచుకుంటూ వచ్చిన దేవర.. అనుకున్నంత కాకపోయినా.. మంచి కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్ కు  మెమరబుల్ హిట్ ను అందించింది. 
 

24
Junior NTRs Devara Two film update out

రాజమౌళితో సినిమా చేస్తే.. నెక్ట్స్ ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ సినిమా చూడాల్సిందే అన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ.. దేవర విజయ పతాకం ఎగరేసింది. ఇక ఈసినిమాలో  డ్యూయల్ రోల్ లో  సోలో పెర్ఫామెన్స్ లో  ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచి దుమ్ము లేపింది. ఇండియాలో అదరగొట్టిన తారక్ మూవీ. ఇక ఫారెన్ లో దుమ్మురేపడానికి రెడీ అవుతోంది. భారీ కలెక్షన్లే టార్గెట్ గా తారక్ పక్కా ప్లాన్ తో గ్యాప్ తీసుకుని మరీ జపాన్ లో ఎంటర్ అవ్వబోతున్నాడు. 
 

34

దేవర సినిమాను  మేకర్స్ ఇపుడు జపాన్లో కూడా రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. జపాన్ లో ఈ  సినిమాను ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జపాన్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడంతో పాటు.. ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేసిందట. అందులో భాగంగా  ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లనున్నాడు.
 

44
Devara

జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో రజినీకాంత్ కు అంత క్రేజ్ ఉండగా.. మధ్యలో బాహుబలి సినిమాతో ప్రభాస్ ఆ క్రెడిట్ ను కొట్టేశాడు. ఆతరువాత ప్రభాస్ కు సమానంగా  క్రేజ్ ను ఎన్టీఆర్ జపాన్ లో సాధించాడు. ఎన్టీఆర్ కు సబంధించిన చిన్న చిన్న కటౌట్లతో పాటు.. మన హీరోల బొమ్మలు, టాటూలు, ఇలా రకరకాలుగా జపాన్ ప్రజలు తమ అభిమానం చాటుకుంటుంటారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories