త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ 8 గురించి వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేరు. దీనితో అంతకి మించి ఎంటర్టైన్మెంట్, హంగామా ఉండేలా నిర్వాహకులు సీజన్ 8ని ప్రిపేర్ చేస్తున్నారు.
సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కానుంది. దీనితో కంటెస్టెంట్స్ ఎవరు అనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోతోంది. ఆల్రెడీ కొందరు కంటెస్టెంట్స్ వివరాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలెబ్రెటీలకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అదే విధంగా కొందరు నటీనటులు, యాంకర్లు కూడా పాల్గొనబోతున్నారు. వివాదాల్లో ఉండేవారిపై అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది అలంటి వారిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ గా ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వినిపిస్తున్న కొన్ని పేర్లు ఆసక్తిని పెంచేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా అలీ దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.
అలీ తమ్ముడు కూడా కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అలీ తమ్ముడు ఖయ్యుమ్ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఖయ్యుమ్ టాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. బ్లేడ్ బాబ్జి లాంటి చిత్రాలు ఖయ్యుమ్ కి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
బిగ్ బాస్ 8 టిఆర్పి రేటింగ్స్ పెంచడానికి ఓ శృంగార తారని రంగంలోకి దించుతున్నారు. ఆమె ఎవరో కాదు స్వాతి నాయుడు. స్వాతి నాయుడు కెరీర్ బిగినింగ్ లో శృంగార సమస్యలపై వచ్చే టివి షోలకు యాంకర్ గా చేసింది. ఆ తర్వాత శృంగార భరిత చిత్రాల్లో నటించింది. పోర్న్ చిత్రాల గురించి ఆమె ఓపెన్ గా మాట్లాడుతూ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.
స్వాతి నాయుడు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక క్రేజీ యాంకర్లు రీతూ చౌదరి, విష్ణు ప్రియ కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే హంగామా మరో రేంజ్ లో ఉంటుంది. కుమారి ఆంటీ, అంబటి రాయుడు, వేణు స్వామి లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.