నిఖిల్, గౌతమ్ లలో విన్నర్ ఎవరు? పృథ్వి బయటపెట్టిన నిజం ఇదే!

First Published | Dec 2, 2024, 4:45 PM IST

మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 ముగియనుంది. టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ నిలిచారు. కాగా వీరిలో విన్నర్ ఎవరో పృథ్వి తేల్చేశాడు. 
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కీలక దశకు చేరుకుంది. టైటిల్ ఎవరిదో రెండు వారాల్లో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అవినాష్ ఆల్రెడీ ఫినాలే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన సంగతి తెల్సిందే. మిగిలిన ఆరుగురిలో నలుగురు ఫైనల్ కి వస్తారు. ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. 

సీజన్ 7లో ఆరుగురు ఫైనల్ కి వెళ్లారు. కాబట్టి ఈ సీజన్ కి కూడా ఆరుగురు కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఇవ్వవచ్చు. ఇక చివరి వారానికి గాను అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఒక అవినాష్ కి మాత్రమే మినహాయింపు ఉంది. కాబట్టి ఫినాలేలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది కీలకంగా మారింది. అయితే నిఖిల్, గౌతమ్ లలో ఒకరికి టైటిల్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధాన పోటీ వీరి మధ్యే అట. ఈ క్రమంలో 13వ వారం ఎలిమినేటైన పృథ్వి కీలక విషయాలు వెల్లడించాడు. 

Latest Videos


పృథ్వి మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.  వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అడ్వాంటేజ్ , డిజ్ అడ్వాంటేజ్.. రెండూ ఉంటాయి. వాళ్ళు గేమ్ చూసి రావడం అడ్వాంటేజ్. అలాగే మొదటి నుండి ఉన్నవాళ్ళుతో పోల్చితే డిసడ్వాంటేజ్.  ఎందుకంటే ఫస్ట్ వీక్ నుండి ఉన్నవాళ్లు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు. వైల్డ్ కార్డ్స్ 8 మెంబెర్స్ అంటే  చాలా ఎక్కువ. మేము కూడా 8 మంది ఉన్నాం, అని పృథ్వి అన్నాడు. 

Bigg boss telugu 8

గౌతమ్ విన్ అవుతాడా అని అడగ్గా... గౌతమ్ విన్ అయినా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే..  గౌతమ్ కి చాలా కష్టాలుఉన్నాయి.  మాలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడి వరకు వచ్చారు.  గౌతం గెలిస్తే కూడా నేను హ్యాపీ. గౌతమ్ కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది. మరి చూడాలి ఏమవుతుందో, అన్నాడు.  

Bigg boss telugu 8

ఇక గౌతమ్ గేమ్ పై మీ అభిప్రాయం ఏంటి? సేఫ్ ఆడుతున్నాడా? జెన్యూన్ గా ఆడుతున్నాడా? అని అడగ్గా..  కొన్నిసార్లు జెన్యూన్ అనిపిస్తారు కొన్నిసార్లు కావాలనే ఇండివిడ్యువల్ ప్లేయర్ అని చూపించడానికి నటిస్తున్నాడేమో అనిపిస్తుంది. గౌతమ్ లోని ఆ షేడ్ నాకు అర్థం కాలేదు. నా అభిప్రాయంలో.. 70- 80% జెన్యూన్ గా ఉన్నాడు. రష్మిని అక్క అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటని పృథ్విని మీడియా అడిగింది. 

Bigg boss telugu 8

 అక్క అనేది నా ప్రకారం  రియల్ ఫీలింగ్ కాదు. అక్కని అక్క అనేది డిఫరెంట్ క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా.  సో ఫస్ట్ క్రష్ అన్నారు కదా తర్వాత అక్క అన్నారు.  అక్క అనేది జన్యూన్ ఫీలింగ్ కాదని చెప్పకనే చెప్పాడు పృథ్వి. కాగా పృథ్వి పరోక్షంగా నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నారని చెప్పాడు. గౌతమ్ గెలిచినా ఓకే, కానీ నిఖిల్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పకనే చెప్పాడు 

click me!