తెలుగు యువతకు బంపరాఫర్ : టెన్త్ విద్యార్హతతో రూ.50,000-60,000 గవర్నమెంట్ జాబ్స్

First Published | Dec 2, 2024, 5:15 PM IST

కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ తో రూ.50-60 వేల సాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. అదికూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు...

Railway Jobs

Railway Jobs : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అతిపెద్ద సంస్థ ఇండియన్ రైల్వేస్ లో పనిచేయాలని చాలామంది యువత కోరిక. ఎలాగైనా రైల్వే ఉద్యోగం సాధించాలని పగలూ రాత్రి కష్టపడి చదువుతుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాలను చెందిన యువతీ యువకులు కూడా రైల్వే జాబ్స్ కు ప్రిపేర్ అవుతుంటారు. అలాంటివారికి గుడ్ న్యూస్... సికింద్రాబాద్ నుండి ప్రధాన కార్యకలాపాలు నిర్వహించే దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలతో ఈ జాబ్స్ సాధించవచ్చు. అయితే స్కౌట్ ఆండ్ గైడ్స్ కోటాలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అంటే నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలతో పాటు స్కౌట్ ఆండ్ గైడ్స్ సర్టిఫికేట్ వున్నవారు అర్హులు. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపడతారు. 
 

Railway Jobs

పోస్టుల వివరాలు, అర్హతలు : 

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా గత సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో స్కౌంట్ & గైడ్స్ కోటాలో గ్రూప్ సి,గ్రూప్ డి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 14 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. 

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ చదివి స్కౌట్ ఆండ్ గైడ్స్ సర్టిఫికేట్ వున్నవారికి ఇది మంచి అవకాశం. చాలా తక్కువ విద్యార్హతలతో ఎక్కువ సాలరీస్ వచ్చే ఉద్యోగాలివి. స్కౌట్ ఆండ్ గైడ్స్ చేసినవారు తక్కువమంది వుంటారు... కాబట్టి పోటీ కూడా చాలా తక్కువగా వుంటుంది. 

Latest Videos


Railway Jobs

వయసు, సాలరీ : 

ఈ ఉద్యోగాల కోసం 18 నుండి 33 సంవత్సరాల వయసుగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓబిసిలకు 3 ఏళ్లు, ఎస్సి, ఎస్టీలకు 5 ఏళ్ల వరకు వయో సడలింపు వుంటుంది. 

ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారు నెలనెలా భారీగా జీతాలు అందుకుంటారు. గ్రూప్ సి ఉద్యోగులకు రూ.19,900 నుండి రూ.63 వేల వరకు జీతం పొందవచ్చు. ఇక గ్రూప్ డి కి ఎంపికయినవారు  రూ.18,000 నుండి రూ.59,200 వరకు జీతం పొందుతారు. సాలరీ కాకుండా రైల్వై ఉద్యోగులకు లభించే అలవెన్సులు కూడా వస్తాయి. 
 

Railway Jobs

దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ : 

ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల అంటే 2024 డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది. పరీక్ష కోసం రూ.500 ఫీజు చెల్లించాలి... రాతపరీక్షకు హాజరైన విద్యార్థులకు రూ.400 రీఫండ్ చేస్తారు. ఎస్సి, ఎస్టి విద్యార్థులకు ఈ ఫీజు కేవలం రూ.250 మాత్రమే... వీరికి కూడా రీఫండ్ లభిస్తుంది. 

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు వుంటుంది. ఇందులో 60 మార్కులు అబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఓ వ్యాసం (Essay) వుంటుంది. మిగతా 40 మార్కులు స్కౌట్ ఆండ్ గైడ్స్ కు సంబంధించి వుంటాయి. 

click me!