న్యూడ్ ఫోటోలు పంపాలన్న నెటిజన్‌కి చిన్మయి షాకింగ్ రిప్లై... సెక్స్ ఎడ్యూకేషన్ అవసరం ఉందంటూ...

First Published May 11, 2021, 1:47 PM IST

డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్లేబాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా బోల్డ్ కామెంట్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. నటుడు రాహుల్ రవీంద్రన్‌ను పెళ్లాడిన చిన్మయి... సమంత, లావణ్య త్రిపాఠి, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వాళ్లకు గాత్రదానం చేస్తుంది. సమంతకు నటిగా వచ్చిన గుర్తింపులో సగం క్రెడిట్ చిన్మయికి దక్కుతుంది.

తాజాగా న్యూడ్స్ పంపాలంటూ చిన్మయికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు. ‘హేయ్... నీ న్యూడ్స్‌ పంపించు, తట్టుకోలేకపోతున్నా’ అంటూ అతను చేసిన మెసేజ్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చింది చిన్మయి శ్రీపాద...
undefined
‘దయచేసి స్వయంతృప్తి చెందు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే గైనకాలజిస్టుతో మాట్లాడు. వాళ్లు ఎలా చేయాలో చెబుతారు అలాగే హైజీన్ ప్రాక్టీస్ చేయి. స్వయంతృప్తి చెందడం తప్పేకాదు...
undefined
నువ్వు ఇలా మహిళలను న్యూడ్ పంపాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు, అది లైంగిక వేధింపుల కిందికి వస్తుంది. మనిషిగా ఉండడం నేర్చుకో...
undefined
లేదా నీ తండ్రితో ఓసారి మాట్లాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆయన నీకు నేర్పిస్తాడని నమ్ముతున్నా... కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండు..’ అంటూ మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్‌ను పోస్టు చేసింది చిన్మయి.
undefined
‘మీరు పేరెంట్ అయితే అతనికి అవసరమైన సాయం చేయండి. మీ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడండి. తల్లిదండ్రులు పిల్లలతో ఈ విషయం గురించి మాట్లాడకపోవడం వల్లే వారికి సెక్స్ గురించి తెలియడం లేదు...
undefined
ఒకవేళ మీరు మీ పిల్లలతో ఇలాంటి విషయాలు చెప్పలేకపోతే సెక్స్ ఎడ్యూకేషన్ థెరపిస్ట్ లేదా కౌన్సిలర్‌కి చూపించండి. సెక్స్ ఎడ్యూకేషన్ గురించి మాట్లాడడానికి సిగ్గు పడకండి. ఇది ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం...
undefined
పిల్లల తల్లిదండ్రులకు, మీ బిడ్డలకు ముందుగా దీన్ని నేర్పాల్సింది మీరే. మీ పిల్లలు పోర్న్ చూస్తున్నప్పుడు మీరు గమనించినా, లేక స్వయంతృప్తి చెందుతున్నారని తెలిసినా... వారిని తిట్టడం, అవమానించడం ఆపండి...
undefined
మీ పిల్లలను కౌన్సిలింగ్‌కి తీసుకెళితే వారికి సాయం చేసినవాళ్లు అవుతారు. మనం ఇలాంటి విషయాలను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే సోసైటీ ఇలా తయారైంది. సెక్స్ ఎడ్యూకేషన్ లేకపోవడం వల్ల పసిపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి...
undefined
కొందరు పిల్లలకు లైంగిక దాడికి గురైన విషయం కూడా తెలియడం లేదు. ఏది కరెక్టు, ఏది తప్పు అనే విషయాలు వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడాలని చూస్తే, ఎలా అడ్డుకోవాలో నేర్పించండి. చాలామంది పిల్లలు, బంధువుల చేతుల్లోనే లైంగిక దాడికి గురి అవుతుండడంతో చెప్పలేకపోతున్నారు...
undefined
మీరు మీ పిల్లాడిని, లేదా పిల్లలను సరిగ్గా పెంచినా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోక తాగుడు వంటి అలవాట్లకు బానిసలై, మాదకద్రవ్యాలు తీసుకుంటూ, తండ్రి లేదా తల్లిని లేక బాధపడే వారి వల్ల మీ పిల్లకు హాని కలగవచ్చు...
undefined
సెక్స్ ఎడ్యూకేషన్ చాలా సాధారణ విషయం, మంచి ఆరోగ్యకర విషయం. సెక్స్ గురించి చెప్పడం వల్ల మీ పిల్లాడి అమాయకత్వం మాయమైపోయి, వాళ్లు వెంటనే సెక్స్ చేయాలని అనుకోరు...
undefined
ఏది సేఫ్, ఏది కాదు అనే విషయాలు మీ పిల్లాడికి తెలుస్తాయి. మీ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే దానిని గుర్తించి, ఎలా స్పందించాలో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మంచి పేరెంట్‌గా ఉండండి’ అంటూ సుదీర్ఘమైన పోస్టులు చేసింది చిన్మయి శ్రీపాద.
undefined
ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నవారి సహాయార్థం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కూడా చేపడుతోంది చిన్మయి శ్రీపాద...
undefined
click me!