కత్రీనా కైఫ్ తల్లి కాబోతోందా..? ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ బ్యూటీ..

First Published Jan 8, 2023, 8:29 AM IST

బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ తల్లికాబోతోందా..? ఈ విషయాన్ని సీక్రేట్ గా ఉంచిందా..? భర్తతో కలిసి ఆలయాలు సందర్శిస్తున్న కత్రీనా.. ట్రోలర్స్ కు ఎలా దొరికిపోయింది. 
 

బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది కత్రీనా కైఫ్. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దడదడలాడించింది. స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. కుర్ర హీరో.. తనకంటే చిన్నవాడైన  విక్కీ కౌశల్ ను లాస్ట్ ఇయర్ పెళ్లాడింది బ్యూటీ. ఈ మధ్య పెళ్లి రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు స్టార్ కపూల్. 

చాలా కాలం విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపించింది కత్రినా కైఫ్.. ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్శాడి చూపించింది. . అయితే తాజాగా ఆమె తల్లి కాబోతుందంటూ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు స్టార్ కపూల్. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

ఈ మధ్య  భర్తతో కలిసి వినాయకుడి గుడిలో పూజలు చేసింది బ్యూటీ.. గుళ్లో వీళ్ళు పూజలు చేస్తోన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడే ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయింది కత్రీనా కైఫ్. ఈఫోటోలో బాలీవుడ్ బ్యూటీని చూసిన కొందరు ఆమెను ధారుణంగా ట్రోల్  చేస్తున్నారు. 

Katrina Kaif

కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ అలాగే అత్త వీణా కౌశల్ తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. గుడికి వచ్చినప్పుడు నుదిట పై బొట్టు పెట్టుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదా అంటూ కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కత్రినా కైఫ్ ముఖంలో ఉన్న కళ చూస్తుంటే ఆమె ప్రెగ్నెంట్ గా అనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. 
 

అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. గతంలో కూడా ఆమె ప్రెగ్నెంట్ అంటూ రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. మరి కొంతమంది నెటిజన్లు మాత్రం  ఈమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. గ్రీన్ చుడీదార్ లో తలపై దుపట్టా వేసుకుని సింపుల్ డ్రెస్ లో వచ్చినందకు మెచ్చుకుంటున్నారు. 

ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఇక పెళ్ళి తరువాత కూడా కత్రీనా కైఫ్ తన సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ షోలు కూడా ఆపడంలేదు.. పెళ్లి తరువాత ఇంకాస్త డోస్ పెంచింది బ్యూటీ

బీచ్ లో బికినీ ఫోటోలతో హాల్ చల్ చేస్తోంది చిన్నది. అటు విక్కీ కూడా తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కత్రీనా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తోంది. ఈటైమ్ లో ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు సినీ జనాలు. 

click me!