దుమారం రేపుతున్న బిపాసా బసు బేబీ బంప్ ఫోటోస్.. భర్తతో కలసి బోల్డ్ ఫోటో షూట్, షేక్ అవుతున్న ఇంటర్నెట్

First Published Aug 16, 2022, 1:47 PM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో కూడా ఆమె మహేష్ బాబు సరసన టక్కరి దొంగ చిత్రంలో మెరిసింది.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో కూడా ఆమె మహేష్ బాబు సరసన టక్కరి దొంగ చిత్రంలో మెరిసింది. బిపాసా 2016లో కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాల విషయంలో జోరు తగ్గించింది ఈ బ్యూటీ. 

బిపాసా బసు నటిగా బాలీవుడ్ లో ఎలా తన హాట్ అందాలతో రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాహం తర్వాత తన భర్తతో రొమాంటిక్ గా ఉన్న పిక్స్ ని సోషల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. బిపాసా భర్త కరణ్ సింగ్ ఆమెకన్నా మూడేళ్లు వయసులో చిన్నవాడు. ప్రస్తుతం బిపాసా వయసు 43 ఏళ్ళు. 

ఈ వయసులో కూడా ఫిట్నెస్ తో, మతి పోగొట్టే గ్లామర్ తో బిపాసా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల బిపాసా బసు తల్లి కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తని నిజం చేస్తూ తన ప్రెగ్నన్సీని బిపాసా అధికారికంగా ప్రకటించింది. 

మైండ్ బ్లోయింగ్ అనిపించేలా బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. బేబీ బంప్ తో తన భర్తతో కలసి బిపాసా బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ నెట్టింట దుమారం రేపుతోంది. అభిమానులని ఆకర్షిస్తోంది. 

ఫాన్స్, సెలెబ్రిటీలు బిపాసా, కరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మలైకా అరోరా, సోఫీ చౌదరి లాంటి ప్రముఖులంతా బిపాసా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

తాను ధరించిన షర్ట్ విప్పేసిన బిపాసా బేబీ బంప్ పూర్తిగా కనిపించేలా భర్తతో రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిపాసా బాలీవుడ్ లో రాజ్, ధూమ్ 2, రేస్, రేస్ 2 లాంటి పాపులర్ చిత్రాల్లో నటించింది. 

click me!