బిగ్‌బాస్‌5ః ఏడుపు స్టార్ట్ చేసిన జెస్సీ, హమీద.. డ్రీమ్‌ అంటూ కాజల్‌ ఎమోషనల్‌..ఫస్ట్ వీక్‌ నామినేట్‌ వీరే

First Published Sep 6, 2021, 11:35 PM IST

బిగ్‌బాస్‌5 సీజన్‌ మొదటి రోజు రసవత్తరంగా సాగింది. మొత్తం నామినేషన్‌ ప్రక్రియతోనే సాగింది. ఇందులోనూ కొందరు ఏడుపులు, మరికొందరి కామెడీ, ఇంకొందని క్లాస్‌లతో సాగింది. ఫైనల్‌గా ఆరుగురు ఫస్ట్ వీక్‌ ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. 
 

ఎలిమినేషన్‌ ప్రక్రియలో మొదట సింగర్‌ శ్రీరామ్‌ చంద్ర.. మానస్‌ని, జెన్సీని నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత ఆర్జే కాజల్‌ని, యాంకర్‌ రవిని సరయు నామినేట్‌ చేయగా, హమీద, నటరాజ్‌ని శ్వేత వర్మ, జెస్సీ, మానస్‌లను విశ్వ, సిరి, మానస్‌లను అనీ మాస్టర్, విశ్వ, హమీదలను జెస్సీ, నటరాజ్‌, మానస్‌లను యాంకర్ రవి, కాజల్‌, జెస్సీలను ఉమాదేవి, లహరి, జెస్సీలను హమీద, సన్నీ, లోబోలను షణ్ముఖ్‌ నామినేట్‌ చేశారు. 

వీరితోపాటు షణ్ముఖ్‌, సరయులను సన్నీ, షణ్ముఖ్‌, హమీదలను ప్రియాంక, యాంకర్‌ రవి, జెస్సీలను నటరాజ్‌, సిరి కాజల్‌లను ప్రియా, ప్రియా, రవిలను లోబో, విశ్వ, సరయులను మానస్‌, హమీద, ప్రియాలను సిరి, సరయు,ఉమాదేవీలను కాజల్‌, హమీద,కాజల్‌లను లహరి నామినేట్‌ చేశారు. 

మొత్తంగా మొదటి వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో యాంకర్‌ రవి, మానస్‌, సరయు, కాజల్‌, హమీద, జెస్సీ ఉన్నారు. జెస్సీకి ఆరుగురు నామినేట్‌ చేయడం విశేషం. ఆయన అమాయకుడని, ఇక్కడ అలా ఉంటే నడవదని నటరాజ్‌ తెలిపారు. దీంతో ఎమోషనల్‌ అయ్యాడు జెస్సీ. ఏడుపు స్టార్ట్ చేశారు. మరోవైపు ప్రారంభం నుంచే హమీద కూడా ఏడుపు స్టార్ట్ చేసింది. 

ఇక ఆర్జే కాజల్‌ని చాలా వరకు కంటెస్టెంట్లు పోటీగా భావిస్తుండటం విశేషం. అయితే తాను నామినేషన్‌కి వెళ్లినప్పుడు కాజల్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఇది తన ఐదేళ్ల డ్రీమ్‌ అని తెలిపింది. తన ఫేవరేజ్‌ షోలో ఇప్పుడు తాను ఉంటున్నందుకు చాలా ఎమోషనల్‌గా ఉందని, ఎగ్జైట్‌మెంట్‌తో కూడిన ఎమోషనల్‌ అని తెలిపింది కాజల్‌. 

యాంకర్‌ రవిపై మాత్రం యాటిట్యూడ్‌ చూపిస్తాడనే కామెంట్లు రావడం విశేషం. లోబో ఆయన్ని యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడని చెప్పి నామినేట్‌ చేశాడు. దీంతో రవి ముఖం వాడిపో
 

మొత్తంగా ఫస్ట్ డే కాస్త ఫన్‌, మరికాస్త కన్నీళ్లు, ఇంకాస్త ఆసక్తికరంగా సాగింది. అయితే షోలో మాత్రం లోబో కమెడీయన్‌గా మారిపోయారు. ఆయన చేసే ప్రతి మూవ్‌మెంట్‌ నవ్వులు పూయిస్తుంది. గత సీజన్‌లో అవినాష్‌ మాదిరిగా ఇప్పుడు లోబో నవ్వులు పూయిస్తున్నాడు. 

click me!