దీప్తి సునైనతో లవ్‌మ్యాటర్‌ బయటపెట్టిన షణ్ముఖ్‌.. హౌజ్‌లోనూ కలవరిస్తూ దొరికిపోయిన వైనం..

First Published Sep 12, 2021, 8:02 PM IST

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా కలిసి ఘాటుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఇప్పటి వరకు అఫీషియల్‌ ప్రకటన లేదు. కానీ తాజాగా షణ్ముఖ్‌ ఆ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పేశాడు. 
 

దీప్తిసునైనా అటు యూట్యూబ్‌లోనూ, ఇటు టీవీలోనూ పాపులర్‌ అయ్యింది. ఆమె ఇప్పటికే బిగ్‌బాస్‌2లో పాల్గొని సందడి చేసింది. అత్యంత ఎనర్జిటిక్ కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ మధ్య స్టార్ట్స్ మ్యూజిక్‌ వంటి షోలోనూ మెరిసింది. 

మరోవైపు షణ్ముఖ్‌తో కలిసి అనేక యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తమకంటూ ఓ ప్రొఫేషన్‌ని క్రియేట్‌ చేసుకుంటూ వ్యవస్థలుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అనేక వీడియోల్లో షణ్ముఖ్‌, దీప్తి కలిసి నటించిన సందర్భాలున్నాయి. వీరిద్దరి మధ్య లవ్‌ వీడియోలు బాగా ఆదరణ పొందాయి. పాపులర్‌ అయ్యాయి. 

వీడియోల్లో ప్రేమే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ వీరిద్దరు ఘాటు ప్రేమలో విహరిస్తున్నారు. కానీ ఎక్కడా తమ ప్రేమ గురించి బయటకు చెప్పలేదు దీప్తి, షణ్ముఖ్‌. తాజాగా బయటపెట్టేశారు. షణ్ముఖ్ బిగ్‌బాస్‌5లోకి వెళ్లారు. దీంతో ఒంటరైపోయింది దీప్తి. 
 

షణ్ముఖ్‌ తోడు లేకపోవడంతో దీప్తి ఒంటరి ఫీలింగ్‌ని అనుభవిస్తుంది. దీంతో వరుసగా సోషల్‌ మీడియాలో ఆయనతో చేసిన వీడియోలనే పంచుకుంటోంది. అందులో భాగంగా `మలుపు` వీడియోని విడుదల చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లను షేర్‌ చేస్తుంది దీప్తి. ఆ రూపంలో షణ్ముఖ్‌పై ప్రేమని వ్యక్తం చేస్తుంది. 

మరోవైపు హౌజ్‌లో ఉన్న షణ్ముఖ్‌ ఏకంగా తన గుండెల్లో ఉన్న పిల్ల ఎవరో చెప్పేశాడు. ప్రేమ సీక్రెట్‌ని బయటపెట్టేశాడు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో తన పిల్లోపై ఉన్న పిల్ల ఎవరు అని అడగ్గా దీప్తి అని మరో ఆలోచన లేకుండా చెప్పేశాడు. దీంతో తన లవ్‌ని రివీల్‌ చేశాడు. 
 

ఇప్పుడు మరోసారి తన ఆవిషయం బయటపడింది. ఇంటి సభ్యులతో తరచూ దీప్తి గురించే కలవరిస్తున్నాడట. ఈ విషయాన్ని విశ్వ చెప్పాడు. షణ్ముఖ్‌ ఎక్కువగా ఏ హౌజ్‌మేట్‌ గురించి మాట్లాడుతుంటాడని అడగ్గా, విశ్వ మరో మాట లేకుండా ఎక్కువగా దీప్తి గురించి చెబుతుంటాడని తెలిపాడు. ఏ హౌజ్‌మేట్‌ గురించి అడగ్గా.. హౌజ్‌మేటా? అంటూ విశ్వ ఆలోచిండం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తం షణ్ముఖ్‌ హౌజ్‌లోనూ దీప్తినే కలవరిస్తున్నాడని, ఆమెతో తన లవ్‌ని అఫీషియల్‌గా రివీల్‌ చేసేశాడని చెప్పొచ్చు. 

మరోవైపు ఆదివారం ఎపిసోడ్‌లో ఆయన ప్రియాతో కలిసి వేసిన స్టెప్పులు అదరగొడుతున్నాయి. షోలో హైలైట్‌గా నిలిచాయి. నాగార్జున సైతం షణ్ముఖ్‌ డాన్స్‌ కి ఫిదా అయిపోవడం విశేషం.

click me!