పూల్ మఖానా తింటే బరువు తగ్గొచ్చా..? ఎలాగబ్బా..?

First Published | Apr 24, 2024, 4:51 PM IST

పూల్ మఖానాలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మరింత ఎక్కువ పోషకాలు అందిస్తుంది. అందుకే.. దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.
 


పూల్ మఖానా తెలియని వారు ఉండరు. తామర పువ్వు గింజలతో ఈ పూల్ మఖానా తయారు  చేస్తారు. ఈ మఖానా మనం చాలా రకాలుగా తినవచ్చు. ఎక్కువగా స్నాక్స్ రూపంలో వీటిని తింటూ ఉంటారు.  ఈ పూల్ మఖానా వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయి.  

పూల్ మఖానాలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మరింత ఎక్కువ పోషకాలు అందిస్తుంది. అందుకే.. దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.
 

Latest Videos


అయితే.. ఈ సూపర్ ఫుడ్ తో ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు అని మీకు తెలుసా..? నిజమే.. ఉదయాన్నే పరగడుపున కనుక దీనిని ఆహారంగా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా.. ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 

తామర గింజలలో ఫైబర్ , ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అదే సమయంలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల చాలా సేపు కడుపు నిండుగా అనిపించి మళ్లీ మళ్లీ ఆకలి వేయదు. మరో మాటలో చెప్పాలంటే, ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఇది బరువును నియంత్రిస్తుంది.
 

Makhana

అంతే కాకుండా ఇందులో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తింటే కొద్ది రోజుల్లోనే పొట్ట తగ్గుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, ముఖ్యంగా అధిక రక్త చక్కెరను నియంత్రణలో ఉంచడానికి దీని వినియోగం.

మకానాలో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలను నివారిస్తుంది. మకానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మకానాలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.
 

Makhana

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. దీనిని నెయ్యిలో వేయించి ఉదయం , సాయంత్రం గ్రీన్ టీతో తినవచ్చు. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మనం ఈ మఖానాని సలాడ్ రూపంలో కూరగాయ ముక్కలతో కలిపి తీసుకుంటే.. మరింత ఆరోగ్యం మీ సొంతమౌతుంది. 

click me!