అంచనాల మధ్య వచ్చి ఫస్ట్ వీక్ లోనే ఎగ్జిట్ అయిన క్రేజీ కంటెస్టెంట్స్... వాళ్ళ ఎలిమినేషన్స్ కూడా అనుమానాస్పదమే!

First Published Sep 13, 2021, 11:19 AM IST

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... 2017లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సెలబ్రిటీ షో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ రీత్యా, ప్రతి సీజన్ సరికొత్తగా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. 

నెలల ముందు నుండే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ... పుకార్లు షికారు చేస్తాయి. ఇక ఫైనల్ గా హౌస్లోకి వెళ్లే సెలెబ్రిటీల లిస్ట్ బయటికి రాగానే, వాళ్ళ  పెర్ఫార్మన్స్, బలాలు, బలహీనతలపై  ప్రేక్షకుల అంచనాలు మొదలైపోతాయి. అలా భారీ అంచనాల మధ్య హౌస్లోకి వెళ్లి మొదటివారమే ఎలిమినేటై, నిరాశపరిచిన కంటెస్టెంట్స్ ఉన్నారు. 
 


ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ గా మొదలైంది. మొదటి సీజన్ లో టాలీవుడ్ కి చెందిన టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఈ స్థాయి సెలెబ్రిటీలు మిగతా సీసన్స్ లో పాల్గొనలేదు. ఈ సీజన్ కి గాను హాట్ బాంబ్ ఇమేజ్ తో నటి జ్యోతి ఎంట్రీ ఇచ్చారు. 
 

వెండితెరపై ఐటెం సాంగ్స్, హాట్, బోల్డ్ రోల్స్ తో అలాంటి ఇమేజ్ తెచ్చకున్న జ్యోతి హౌస్ లో అందాల విందుతో రచ్చ చేస్తారని, ఆమె జర్నీ చాలా వారాలు ఉంటుందని అందరూ భావించారు. అయితే మొదటివారమే ఆమె హౌస్ నుండి ఎలిమినేటై షాక్ ఇచ్చారు.

సెకండ్ సీజన్ హోస్టింగ్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని రంగంలోకి దిగారు. ఈ సీజన్లో కూడా టాప్ సెలెబ్రిటీలు హౌస్లోకి ఎంటర్ కావడం జరిగింది. వాళ్లలో మోడల్ సంజన అన్నే ఒకరు. 

ఈ అందాల భామ తన గ్లామర్ పవర్ తో హౌస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని, హౌస్ లో చాలా కాలం ఉంటారని ఊహిస్తే, మొదటివారమే చాప చుట్టేసింది. ఈమె ఎలిమినేషన్ కూడా ఒకింత షాక్. 

సీజన్ 2 హోస్టింగ్ బాధ్యతలు నాని సరిగా నెరవేర్చలేకపోయారని విమర్శలు రావడంతో ఆయన తప్పుకున్నారు. దీనితో కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న నటి హేమ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేటై ఇంటి బాటపట్టారు. 

నటిగా మంచి పాపులారిటీ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ కావడంతో ప్రేక్షకుల ఆదరణతో ఎక్కువ కాలం హౌస్లో ఉంటుందని అనుకుంటే, ఆమె అభిమానులను ఉసూరుమనిపించింది.

సీజన్ 4 కంటెస్టెంట్స్ లో దర్శకుడు సూర్య కిరణ్ ఒకరు. హౌస్ లో పెద్దరికం చూపించిన సూర్య కిరణ్ ని ప్రేక్షకులు మొదటివారమే ఇంటికి పంపించేశారు. 

ఇక లేటెస్ట్ సీజన్ మొదటి ఎలిమినేషన్ ద్వారా యూట్యూబర్ సరయు హౌస్ నుండి బయటికి రావడం జరిగింది. బోల్డ్ కామెంట్స్, బూతులు, రఫ్ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అయిన సరయు హౌస్ లో రచ్చ చేస్తుందని అందరూ భావించారు. 


నామినేషన్స్ లో ఉన్న సరయు తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యారు. అయితే సరయు ఎలిమినేషన్ పై అనుమానాలు ఉన్నాయి. జెస్సి కి బదులు ఆమెను బలి చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  అనేక సంస్థల సర్వేలో జెస్సికి తక్కువ ఓట్లు పడ్డాయి. గత నాలుగు సీజన్స్ నుండి ఎలిమినేషన్స్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. 
 

click me!