రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 27, 2024, 2:54 PM IST

 ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రెండింటిని తుంచి.. ఆ ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి.

హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, పెరట్లో లేదంటే ఇంటి ముందు కచ్చితంగా తులసి మొక్కను పెంచుకుంటారు.  ప్రతిరోజూ ఆ తులసి ముక్కకు నీరు సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.

అయితే... ఈ తులసి మొక్కతో మనకు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రెండింటిని తుంచి.. ఆ ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి.
 


తులసి ఆకులను దిండు కింద పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి..?

దిండు కింద తులసి ఆకును ఉంచడం వల్ల ప్రతికూలత తొలగిపోయి ఇంట్లో  సానుకూలత పెరుగుతుంది. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తే, మీరు తప్పనిసరిగా మీ దిండు కింద ఒక తులసి ఆకును ఉంచుకోవాలి. దీనితో మీకు చెడు ఆలోచనలు రావు. మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

తులసి ఆకులను దిండు కింద ఉంచితే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని నమ్ముతారు.  ఇది కాకుండా, ఏదైనా మానసిక అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడితే, అది కూడా పోతుంది. అంతేకాకుండా, కోపాన్ని నియంత్రించడంలో కూడా ఇది మీకు చాలా సహాయపడుతుంది. విపరీతమైన కోపం ఉన్నవారు రెండు తులసి ఆకులను రోజూ దిండు కింద పెట్టుకుంటే కోపం తగ్గిపోతుంది.

దిండు కింద ఒక తులసి ఆకును ఉంచడం ద్వారా, చెడు శక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీపై ఎదైనా చెడు కన్ను పడినా ఆ దిష్టి కూడా పోతుంది.  దిండు కింద తులసి ఆకును ఉంచడం వల్ల గ్రహాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. గ్రహాల నుండి లభించిన అశుభం తొలగిపోవడం ప్రారంభమవుతుంది. గ్రహ దోషాలు ఏమున్నా తొలగిపోతాయి.
 

అది కూడా తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో పెట్టి.. అప్పుడు  తల కింద పెట్టుకుంటే... ధన ప్రవాహం పెరుగుతుంది. ఎక్కడైనా ధనం రావాల్సినది ఆగిపోతే.... ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి.. డబ్బు మీ చేతికి చేరుతుంది.

Latest Videos

click me!