పెళ్లైందిగా, పిల్లలున్నారుగా అని అడిగేవారికి ఇదే సమాధానం.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్ వైరల్‌

Published : Apr 27, 2024, 02:14 PM IST

సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ టాపిక్‌గా మారే అనసూయ ఇప్పుడు మరోసారి క్రేజీ పోస్ట్ పెట్టింది. అలాంటి కామెంట్లు చేసేవారికి ఇదే సమాధానం అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.   

PREV
16
పెళ్లైందిగా, పిల్లలున్నారుగా అని అడిగేవారికి ఇదే సమాధానం.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్ వైరల్‌

మాజీ జబర్దస్త్ యాంకర్‌ అనసూయ.. మహిళలకు సంబంధించిన ప్రతి అంశంపై స్పందిస్తుంది. తన ముందు అన్యాయం జరిగితే ఊరుకోరు. ఏ సందర్భంలో అయినా ఆమె రియాక్ట్ అవుతుంది. దీని కారణంగా ఆమె చాలా సార్లు విమర్శలపాలవుతుంది. చాలా ట్రోల్స్ కి గురయ్యింది. కానీ తాను స్పందించడం మాత్రం మానదు. 
 

26
Anasuya Bharadwaj

జబర్దస్త్ మానేసి సినిమాల్లో బిజీ అయ్యింది అనసూయ భరద్వాజ్‌. బలమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మెప్పిస్తుంది. తన విశ్వరూపం చూపిస్తుంది. విలక్షణ పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది. నెగటివ్‌ రోల్స్, బోల్డ్ రోల్స్, పాజిటివ్‌ రోల్స్ ఇలా పాత్ర ఏదైనా తాను రెడీ అంటుంది. అంతేకాదు స్పెషల్‌ సాంగ్‌ల్లోనూ మెరుస్తూ అదరగొడుతుంది. 
 

36

తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరో రచ్చకి కారణమవుతుంది. ఇన్‌స్ట్రామ్‌లో ఆమె ఓ వీడియోని పంచుకుంది. ఇందులో 60ఏళ్ల మహిళ అందాల పోటీల్లో టైటిల్ ని గెలుచుకుంది. ఆమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుంది. ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

46

అయితే ఈ వీడియోని ఉద్దేశిస్తూ అనసూయ ఓ కామెంట్‌ చేసింది. ఈ వీడియో ఎంతో మందికి సమాధానం అని తెలిపింది. ఇలానే సమాధానం చెబుతూ ఉండాలని పేర్కొంది. సెక్సీస్ట్ లు, బాడీ షేమింగ్ కామెంట్లు చేసే వారిని ఉద్దేశించి అనసూయ ఈ కామెంట్ చేయడం విశేషం. 

56

ఆడవాళ్లకి పెళ్లైందని, పిల్లలున్నారుగా, 30ఏళ్లు దాటాయిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేస్తారు, ఇంట్లో ఉండొచ్చుగా అని మహిళలను ఉద్దేశించి కామెంట్లు చేసే వారికి ఇలానే సమాధానం చెప్పాలని అనసూయ కామెంట్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ వీడియోతోపాటు అనసూయ కామెంట్ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. మరి ఇది మున్ముందు ఎలాంటి రచ్చకి కారణమవుతుందో చూడాలి. 
 

66
Anasuya bharadwaj

అనసూయ.. ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. దాక్షాయణి పాత్రతో అలరించబోతుంది. దీంతోపాటు తెలుగు మరో రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యిందని సమాచారం. అలాగే తమిళంలో సినిమా చేస్తుంది. కానీ గతంతో పోల్చితే అనసూయ కి ఆఫర్లు తగ్గాయనిపిస్తుంది. అవకాశాలు రావడం లేదా? సెలక్టీవ్‌గా వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories