ఆధారాలతో సహా షణ్ముఖ్ బండారం బయటపెడతా... బిగ్ బాస్ సరయు సంచలనం, రేపు ఏం జరగబోతుంది?

First Published Sep 15, 2021, 1:23 PM IST

ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సెవెన్ ఆర్ట్స్ సరయు మొదటివారమే ఎలిమినేట్ అయ్యారు. షో నుండి బయటికి వచ్చిన సరయు కంటెస్టెంట్స్ సన్నీ, రవిలతో పాటు షణ్ముఖ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 
 

ముఖ్యంగా షణ్ముఖ్ మగాడే కాదని, సరిగా ఆడే ధైర్యం లేకుంటే గాజులు వేసుకొని హౌస్ లో ఓ మూలాన కూర్చోవాలని ఘాటు కామెంట్స్ చేశారు.

ఈ నేపథ్యంలో సరయుపై షన్ను ఫ్యాన్స్ సోషల్ మీడియా దాడికి దిగారట. ఫోన్లు చేసి కూడా కొందరు బెదిరిస్తుండగా, సదరు వ్యక్తులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది సరయు. 

సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సరయు.. రెండు విషయాలు మాట్లాడదలచుకున్నాను అంటూ మొదలుపెట్టారు. షన్ను గురించి కామెంట్స్ చేసిన నాపై కొందరు సోషల్ మీడియా దాడికి దిగారు. కొందరు ఫోన్స్ చేసి మరీ బెదిరిస్తున్నారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. 


సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పాపను ఒకడు రేప్ చేసి, మర్డర్ చేశాడు.  ఆ పాప గురించి కానీ, వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ మీరు, నాపై కామెంట్స్ కోసం ఉపయోగించే సమయంలో సగం కూడా ఉపయోగించలేదు. 

మా ఇల్లు సరూర్ నగర్ లో, సింగరేణి కాలనీకి దగ్గరే. రేపు నేను చైత్ర పేరెంట్స్ కి మద్దతుగా అక్కడికి వెళుతున్నా, మీకు దమ్ముంటే అక్కడకు వచ్చి, మనుషులుగా మీకున్న పవర్ తో మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి. 

ఆ తరువాత నన్ను బూతు తిడుతూ కామెంట్స్ పెట్టండి. మీ ప్రతి కామెంట్ కి నేను ఆన్సర్ ఇస్తాను. అప్పటి వరకు చిన్నారి చైత్ర గురించి ఆలోచించండి.. అంటూ ఫైర్ అయ్యారు సరయు. 


షన్ను పై నేను అలాంటి ఆరోపణలు చేశానంటే నేను ఎంత పేస్ చేసి ఉండాలి. షన్నుతో నాకు ఎదురైన సంఘటనలు టెలికాస్ట్ అయ్యి ఉంటాయని, స్టేజ్ పై నా ఆవేదన నేను చెప్పుకున్నాను. కానీ అవేమి టెలికాస్ట్ కాలేదు. అయినా నో ప్రాబ్లమ్. 

నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో రేపు ఉదయం 11గంటలకు షణ్ముఖ్ బండారం బయటపెడతాను, చూస్తూ ఉండండి. హౌస్ నుండి బయటికి వచ్చాక షో గురించి, కంటెస్టెంట్స్ గురించి ఇలాంటి వీడియోలు చేయాలని నేను అనుకోలేదని, కానీ పరిస్థితుల కారణంగా చేస్తున్నానని సరయు తెలియజేశారు. 


మరి సరయు దగ్గర షన్ను గురించిన ఆ ప్రూఫ్స్ ఏమిటి? ఆ ఫ్రూఫ్స్ వలన షణ్ముఖ్ బిగ్ బాస్ జర్నీ ఎలా సాగనుంది, అనేది ఆసక్తికరంగా మారింది. 

click me!