ఆఫర్స్ కోసం గ్లామర్ ని ఎర వేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... అయినా దర్శక నిర్మాతలు పట్టించుకోని వైనం!

First Published Jun 16, 2021, 12:25 PM IST

వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలని లక్షల మంది అమ్మాయిలు కలగంటారు. హీరోయిన్ గా సక్సెస్ అయితే వచ్చే ఫేమ్, హోదా, చూపుకోసం ఎగబడే ఫ్యాన్స్... ఇలా రాణి భోగాలకు ఏమి తక్కువ కాని లగ్జరీ లైఫ్. మరి అందరికీ ఆ అదృష్టం దక్కుతుందా అంటే చాలా కష్టం...

ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమకు అనేక మంది హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. వారిలో స్టార్ హోదా తెచ్చుకొని పరిశ్రమలవు పది కాలాలు కొనసాగేది కొందరే. ఈ తరంలో అనుష్క, కాజల్, తమన్నా, సమంత వంటి హీరోయిన్స్ స్టార్స్ గా చాలా కాలంగా కొనసాగుతున్నారు.
undefined
వాళ్ళ మాదిరే స్టార్ హీరోయిన్ కావాలని వచ్చిన తెలుగు అమ్మాయి తేజస్వి మాదివాడ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తేజస్వి చిన్న చిన్న వ్యాంప్ పాత్రలతో వెండితెరకు పరిచయం అయ్యారు.
undefined
2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో చిరుమల్లె చెట్టు మూవీలో తేజస్వి హీరోయిన్ సమంత ఫ్యామిలీ మెంబర్ గా కాలేజీ గర్ల్ రోల్ చేసింది. ఆ తరువాత రెండు చిత్రాలలో అదే తరహా చిన్న చిన్న పాత్రలు చేశారు.
undefined
అయితే రామ్ గోపాల్ వర్మ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ మూవీలో ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. తేజస్వి ఆ మూవీలో బోల్డ్ రోల్ లో రెచ్చిపోయింది. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కెరీర్ కి ఉపయోగపడలేదు.
undefined
చెప్పుకోడానికి 20సినిమాలకు పైగా చేసినా ఒక్క సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. మరలా ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశం రాలేదు.2017తరువాత ఆమెకు ఆఫర్స్ పూర్తిగా రాకపోవడం గమనార్హం.
undefined
దీనితో 2018లో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. పొట్టి డ్రెస్ లలో హాట్ హాట్ గా షోలో పిచ్చెక్కించింది తేజస్వి. అయినా ఆమె యాటిట్యూడ్, ప్రవర్తన ప్రేక్షకులకు నచ్చలేదు. దీనితో 7వ వారం హౌస్ నుండి బయటికి వచ్చేశారు.
undefined
ఇంస్టాగ్రామ్ లో తేజస్వి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ గ్లామరస్ ఫిగర్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వెబ్ సిరీస్లు, సినిమాలలో కూడా ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. తన గ్లామర్ తో ఎంతగా ఎరవేస్తున్నా దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు..
undefined
click me!